T20 World Cup : టి20 ప్రపంచ కప్ లో మరో రికార్డ్ నమోదు చేసిన కింగ్ కోహ్లీ..

టి20 ప్రపంచ కప్ 2022 ఆస్ట్రేలియా లో ప్రారంభమై అన్ని క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్లు హోరాహోరీగా జరుగుతున్నాయి.టి20 వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ కింగ్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు.దీని కారణంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నా టీమిండియా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో ఓడిపోయింది.దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగులు చేసిన టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ అరుదైన రికార్డును సాధించాడు.ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.టి20 ప్రపంచ కప్ లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో శ్రీలంక మాజీ ఆటగాడు మహేల జయవర్థెనె 1,016 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు.

 King Kohli Set Another Record In The T20 World Cup , T20 World Cup, King Kohli,-TeluguStop.com

తాజాగా విరాట్‌ 1,001 పరుగులు చేసి రెండో స్థానానికి దూసుకొచ్చాడు.మరో 15 పరుగులు చేస్తే శ్రీలంక ఆటగాడిని వెనక్కి నెట్టి మొదటి స్థానంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది.

ప్రస్తుతం టీమిండియా కింగ్ కోహ్లీ ఉన్న ఫామ్ ను బట్టి చూస్తే 15 పరుగులు చేసి మొదటి స్థానంలోకి రావడం మన కింగ్ కోహ్లీకి అంత పెద్ద విషయం ఏమీ కాదు.ఆస్ట్రేలియాలో జరుగుతున్న టి20 వరల్డ్ కప్ 2022లో భారత్తో జరిగిన మ్యాచ్లలో, మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ పై 53 బంతుల్లో 82 పరుగులు, నెదర్లాండ్స్ పై 44 బంతుల్లో 62 పరుగులు చేసిన విషయం అందరికీ తెలిసిందే.

Telugu Australia, Cricket, India, Virat Kohli-Sports News క్రీడలు

అంతే కాకుండా ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో 3,868 పరుగుల తో అత్యధిక స్కోరు చేసిన ఆటగాళ్ల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు.ఇందులో 36 అర్థసెంచరీలు ఉన్నాయి.టి20 ప్రపంచ కప్ 2022 ముగిసే వరకు మన టీం ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీ ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తాడో అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube