ఈ భూ ప్రపంచంలో ఎన్నో సరీసృపాలు నివసిస్తున్నాయి.నేల మీద పాకుతూ వెళ్లే ఈ జీవులలో కొన్ని అత్యంత భయంకరంగా కనిపిస్తుంటాయి.వాటిలో కొమొడో డ్రాగన్ ముందు వరుసలో ఉంటుంది.భూగ్రహంపై జీవించి ఉన్న అతిపెద్ద బల్లి ఇది.దీని పొడవు 2-2.5 మీటర్లు, బరువు 90 కేజీల ఉంటుందంటే ఇది ఎంత పెద్దగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.ఒక రాక్షసబల్లిలా కనిపించే ఇది ఇతర జీవులను అత్యంత ఘోరంగా వేటాడి చంపేస్తుంది.ఈ బల్లి పళ్లు సొర చేప పళ్లలా చాలా పదునుగా ఉంటాయి.ఈ బల్లి అత్యంత హానికరమైన విషాన్ని కలిగి ఉంటుంది.కాగా ఇలాంటి ఒక డేంజరస్ కొమొడో డ్రాగన్‌కు తాబేలు ఆహారం అయ్యింది.
తాబేలును కొమొడో డ్రాగన్ చంపేసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఫ్యాసినేటింగ్ అనే ట్విట్టర్ పేజ్ తాజాగా పోస్ట్ చేసిన ఈ వీడియో నాలుగు లక్షల వ్యూస్‌తో ఇంటర్నెట్‌లో ట్రెండింగ్ వీడియోగా మారింది.
వైరల్ అవుతున్న వీడియో ఓపెన్ చేస్తే మనకు ఓ కొమొడో డ్రాగన్ బీచ్‌పై నడుస్తూ ఉండటం కనిపిస్తుంది.దీని తల తాబేలు పెంకులో ఇరుక్కు పోయినట్లుగా కనిపించింది.
కానీ అది ఇరుక్కు పోలేదు.ఈ డెడ్లీ డ్రాగన్ తాబేలును పూర్తిగా తినేసి దాని శంకంలో తల దూర్చేసి అందులో ఉన్న మాంసాన్ని మొత్తం జుర్రుతోంది.
తాబేలు కర్పరంలోని మెత్తటి మాంసాన్ని పూర్తిగా తిన్న తర్వాత ఒక్కసారిగా అది తన తలను విదిలించింది.దాంతో తాబేలు పెంకు దాని తల నుంచి కింద పడిపోయింది.అప్పుడు ఆ కొమొడో డ్రాగన్ ఫేస్ కనిపించింది.అంతటితో వీడియో ముగిసింది.తాబేలు కర్పరాన్ని తలకు హెల్మెట్‌లా, ఒక టోపీలా తగిలించుకుని కనిపించిన ఈ కొమొడోడ్రాగన్ ని చూసి నెటిజన్లు భయపడుతున్నారు.ఈ బల్లి చాలా భయానకంగా ఉందని కామెంట్ చేస్తున్నారు.
ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.