బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టంట్స్ అంతా బిగ్ బాస్ చూసి వచ్చారో లేక బిగ్ బాస్ మీద ఆసక్తితో వచ్చారో కానీ.టాస్కుల విషయంలో మాత్రం సరైన పరార్మెన్స్ ఇవ్వట్లేదు.
ఈ క్రమంలో ఏడవ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా హౌస్ మెట్స్ కి సినిమా హీరోల టాస్క్ ఇచ్చాడు.వారికి ఇచ్చిన పాత్రల్లో వారు ఉండి ఎంటర్టైన్ చేయాలి.
అయితే ఈ టాస్క్ లో బిగ్ బాస్ చెప్పినప్పుడు మాత్రమే పాత్ర నుంచి బయటకు రావాల్సి ఉంటుంది.అయితే రేవంత్, అర్జున్ కళ్యాణ్ టాస్క్ నుంచి బయటకు వచ్చి గొడవ పడ్డారు.
దీనివల్ల బిగ్ బాస్ ఆ కెప్టెన్సీ టాస్క్ క్యాన్సిల్ చేశాడు.
అయితే టాస్క్ క్యాన్సిల్ చేయడం వరకు ఓకే కానీ ఈ సీజన్ అంత వరస్ట్ హౌస్ మెట్స్ ఇదివరకు సీజన్లలో చూడలేదని బిగ్ బాస్ అన్నాడు.
ఈ కామెంట్ చాలా పెద్దది.దీనిపై వీకండ్ లో నాగార్జున కూడా ఖచ్చితంగా సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంది.బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున కూడా ఆరితేరాడు.ఈ క్రమంలో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ క్యాన్సిల్ అవడానికి రీజన్ ఎవరు.
ఎందుకు అలా చేశారన్నది శనివారం ఎపిసోడ్ లో ఖచ్చితంగా నాగార్జున క్లాస్ పీకే ఛాన్స్ ఉంది.