బంగాళదుంప జ్యూస్ త్రాగితే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు

బంగాళదుంప అంటే ఇష్టం లేని వారు దాదాపుగా ఎవరు ఉండరు.బంగాళదుంపతో కూర,ఫ్రై వంటివి చేసుకొని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు.

 Amazing Potato Juice Benefits , Potato Juice , Anti-inflammatory, Potato, Migraine Headache-TeluguStop.com

అయితే ఇలా తినటం కన్నా బంగాళదుంపను జ్యూస్ రూపంలో తీసుకుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు అంటున్నారు.ఆ ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.

బంగాళదుంప జ్యూస్ లో ఫైబర్ ఎక్కువగా ఉండుట వలన రెగ్యులర్ గా త్రాగితే మలబద్దకం సమస్య తగ్గిపోతుంది.బంగాళదుంప తింటే బరువు పెరుగుతారని చాలా మంది తినటం మానేస్తు ఉంటారు.

 Amazing Potato Juice Benefits , Potato Juice , Anti-inflammatory, Potato, Migraine Headache-బంగాళదుంప జ్యూస్ త్రాగితే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు-Telugu Health-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే బంగాళదుంప జ్యూస్ త్రాగితే బరువు తగ్గుతారని కొన్ని అధ్యయనాలు చెపుతున్నాయి.

బంగాళదుంప జ్యూస్ లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉండుట వలన కీళ్ల నొప్పులు తగ్గటమే కాకుండా మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారికి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

అలాగే రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.బంగాళదుంపలో పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన కండరాలకు బలాన్ని ఇస్తుంది.అంతేకాక హై బిపిని తగ్గిస్తుంది.హై బిపి తగ్గటంతో రక్త సరఫరా మెరుగుపడి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ.

బంగాళదుంపలో మనకు రోజువారీగా కావల్సిన బి విటమిన్లు 40 శాతం వరకు లభిస్తాయి.దీని వల్ల నాడీ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.

లివర్ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.జుట్టుకు పోషణ లభిస్తుంది.

బంగాళదుంపలో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube