ఉత్తరాంధ్ర జనసేన నేతలకు విశాఖ కోర్టులో చుక్కెదురైంది.తొమ్మిది మంది జనసేన నాయకుల బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం రద్దు చేసింది.
ఈ క్రమంలో తొమ్మిది మందిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు.దీంతో బెయిల్ రావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.
విశాఖ ఎయిర్ పోర్టు ఘటనలో జనసేనకు చెందిన నేతలను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే.విశాఖ గర్జన కార్యక్రమంలో పాల్గొని వెళ్తున్న మంత్రుల కాన్వాయ్ లపై ఎయిర్ పోర్టు వద్ద జనసేన నేతలు, కార్యకర్తలు కర్రలతో దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేసులు నమోదు చేసిన పోలీసులు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
.