ఈరోజు ఉదయం విశాఖపట్నం వేదికగా మూడు రాజధానులకు మద్దతుగా జరిగిన “విశాఖ గర్జన” కార్యక్రమం విజయవంతం అయింది.ఈ కార్యక్రమానికి వైసీపీ మంత్రులు.
విశాఖ రాజధాని కావాలని కోరుకునే జేఏసీ నాయకులు హాజరయ్యారు.ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా విశాఖపట్నం రాజధానిగా చేయాలని తెలపడం జరిగింది.
ఈ క్రమంలో ఈ కార్యక్రమం ముగించుకుని విశాఖపట్నం విమానశ్రయం వద్దకు మంత్రి జోగి రమేష్ వెళ్ళిన సమయంలో.జనసేన పార్టీ కార్యకర్తలు రాళ్లదాడి చేయడం జరిగింది.
మంత్రి జోగి రమేష్ కారుపై రాళ్లతో దాడి చేయడంతో.ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
దీంతో జోగి రమేష్ పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు.మీ కార్యకర్తలను అదుపులోకి పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు.ఇదే సమయంలో మా పార్టీ కార్యకర్తలు తిరగబడ్డారు అంటే రాష్ట్రంలో ఎవరు తిరగలేరని కీలక వ్యాఖ్యలు చేశారు.జనసేన పార్టీ కార్యకర్తలు చేసిన దాడిలో వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి అని ఆరోపించారు.
పవన్ కళ్యాణ్. అరాచక వాదులను తయారు చేస్తున్నారని మండిపడ్డాడు.
మాపై దాడి చేసి ఏం సాధిస్తారు అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు.