తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా సాగుతోంది.మూడు వారాలు పూర్తి చేసుకున్న బిగ్బాస్ తెలుగు నాలుగవ వారంలో అడుగు పెట్టేసింది.
ఈ వారం నేహా చౌదరి ఎలిమినేట్ కాబోతున్నట్లుగా స్టార్ మా నుండి అనధికారికంగా లీక్ వచ్చేసింది.గత రెండు మూడు వారాలుగా వస్తున్న లీక్ నిజమవుతుంది.
కనుక ఈ వారం కచ్చితంగా నేహా చౌదరి ఎలిమినేట్ అవ్వడం పక్క అంటూ చాలా మంది చాలా రకాలుగా విశ్లేషిస్తున్నారు.ఇదే సమయంలో రెండవ వారంలో ఎలిమినేట్ అవ్వాల్సిన ఇనాయ సుల్తానా ఈ వారం కూడా ఎలా సేఫ్ అయింది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
సుల్తానా కి రాంగోపాల్ వర్మ మద్దతుండడం వల్లే ఆమె హౌస్ లో కొనసాగుతోంది అంటూ బలంగా వార్తలు వినిపిస్తున్నాయి.బిగ్ బాస్ కాన్సెప్ట్ డిజైన్ మరియు నిర్వాహకులు ముంబైకి చెందిన వారు.
వారికి రాంగోపాల్ వర్మకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయట.ఆ సన్నిహిత సంబంధాల వల్లే ప్రతి సీజన్ లో కూడా తాను చెప్పిన ఒకరు లేదా ఇద్దరిని హౌస్ లోకి పంపించేలా వర్మ వారితో ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

అందులో భాగంగానే అషు రెడ్డి మరియు అరియాననా వెళ్లారు.ఇప్పుడు ఇనాయ సుల్తానా హౌస్ లో అడుగు పెట్టింది.ఆమె ఏదో వెళ్ళాను వచ్చాను అన్నట్లుగా కాకుండా మినిమం 10 వారాలు అయినా ఉండాలని రామ్ గోపాల్ వర్మ బలంగా భావిస్తున్నాడు.అందుకే ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో ట్వీట్ కూడా చేసి ఓట్లు వేయమంటూ కోరిన విషయం తెలిసిందే.
వర్మ వంటి ఒక స్టార్ దర్శకుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ కి ఓట్లు వేయండి అంటూ విజ్ఞప్తి చేయడం కాస్త విడ్డూరంగానే అనిపించినా నిజమే.ఆయన కేవలం ఓట్లు వేయండి అంటూ విజ్ఞప్తి చేయడం మాత్రమే కాకుండా తాను పంపించిన కంటెస్టెంట్ కి తక్కువ ఓట్లు వచ్చినా కూడా ఎలిమినేట్ చేయవద్దు అంటూ బిగ్ బాస్ నిర్వాహకులకు విజ్ఞప్తి చేసినట్లు ఉంది.
అందుకే వారు ఇనాయా సుల్తానా కి తక్కువ ఓట్లు వచ్చిన కూడా ఆమెను కంటిన్యూ చేస్తున్నారంటే గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇందులో నిజం ఎంతో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.