సీఎం జగన్ పై జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ విమర్శలు చేశారు.జగన్ చిత్తూరు జిల్లా కుప్పం పర్యటన సందర్భంగా అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసారు.
ఈ క్రమంలో ఒక్క బటన్ నొక్కడానికి మూడు వరుసల బ్యారికేడ్లు అవసరమా అని నాదెండ్ల ప్రశ్నించారు.రోడ్లు వేయడం రాదు కానీ.
రోడ్లు తవ్వేసి బ్యారికేడ్లు మాత్రం వేయిస్తున్నారని మండిపడ్డారు.మూడు వేల మంది పోలీసులు, మూడు వేల బస్సులు ఉండాలా ముఖ్యమంత్రి గారూ అంటూ ట్వీట్ లో విమర్శించారు.