తిరుపతి జిల్లా గూడూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల మాఫియా వెలుగులోకి వచ్చింది.ఆస్పత్రి నుంచి ఓ యువకుని మృతదేహాన్ని తీసుకుని వెళ్లనివ్వకుండా డ్రైవర్లు అడ్డుకున్నారు.మృతదేహాన్ని తీసుకెళ్లాలంటే తాము చెప్పిన నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు.17 కిలోమీటర్ల దూరం మృతదేహాన్ని తరలించడం కోసం రూ.4 వేలు డిమాండ్ చేశారు.వేరే వాహనాన్ని బయట నుంచి తెచ్చుకునేందుకు ప్రయత్నించగా.
అనుమతి లేదంటూ గొడవకు దిగారు.దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు.పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
అయితే, అంబులెన్స్ డ్రైవర్ల తీరుపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.