ఏ భార్య అయినా తన భర్తకు ఇష్టం వచ్చిన వంటలు చేస్తూ ప్రేమగా తినిపిస్తుంది.కొన్నిసార్లు ఆట పట్టించేందుకు అతనికి నచ్చని వంటకాలను కూడా నోటి వద్దకు తీసుకొచ్చి తినమంటుంది.
కానీ భర్తకు అదంటే అస్సలే పడదు అనుకున్న వాటిని మాత్రం ఇంట్లో అస్సలే వండదు.అంతేనా వీలైతే తాను కూడా తినడం మానేస్తుంది.
కానీ ఇక్కడో యువతి ప్రేమించి పెళ్లి చేస్కున్న భర్తకు ఇష్టంలేని వంటకం తనిపించింది.తమ్ముడితో కలిసి బలవంతంగా భర్త నోట్లో బీఫ్ కుక్కింది.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.
గుజరాత్ రాష్ట్రం సూరత్ లోని ఉఢానాలో జూన్ 27వ తేదీన రోహిత్ సింగ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేస్కున్నాడు.అయితే అతను బలవన్మరణానికి పాల్పడే కంటే ముందే ఫేస్ బుక్ లో ఓ సూసైడ్ నోట్ ను పోస్ట్ చేశాడు.
తన తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ప్రేమించి పెళ్లి చేస్కున్న భార్య సోనమ్, ఆమె తమ్ముడు అక్తర్ అలీ కలిసి తనను చాలా హింసించారని అందులో తెలిపాడు.అలాగే తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా బీఫ్ తినిపించారని ఆరోపించాడు.
అది తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు వివరించాడు.ఆ తర్వాత రోహిత్ తన భార్యతో కలిసి ఉంటున్న ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయాడు.
పేస్ బుక్ పోస్ట్ చూసిన రోహిత్ స్నేహితుడు.విషయాన్ని మృతుడి తల్లిదండ్రులకు, పోలీసులకు వివరించాడు.
దీంతో కేసు నమోదు చేసుకున్నపోలీసులు రోహిత్ చావుకు కారణం అయిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.