టాలీవుడ్ లో సినిమా ఈవెంట్స్ కి ఒకప్పుడు ప్రసాద్ ల్యాబ్ కేరాఫ్ అడ్రెస్ గా ఉండేది.ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అన్ని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసుకుంటూ టీజర్ రిలీజ్, ప్రెస్ మీట్ లు లాంటివి ప్రసాద్ ల్యాబ్ లో ఆడిటోరియం లో పెట్టుకునే వాళ్లు.
అయితే ఇప్పుడు టీజర్ రిలీజ్, సాంగ్ రిలీజ్ లకు ప్రసాద్ ల్యాబ్ లో కాకుండా కొత్తగా కట్టిన మహేష్ ఏ.ఎం.బి మాల్ ని ప్రిఫర్ చేస్తున్నారు.మహేష్ బాబు థియేటర్ అయిన ఏ.
ఎం.బి మాల్ లో ఓ బిగ్ స్క్రీన్ లో ఈ స్పెషల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి.
ఇదివరకు ప్రసాద్ ల్యాబ్ లో జరిగే ప్రెస్ మీట్ లు, టీజర్ రిలీజ్ ఈవెంట్ లు లాంటివి ఏ.ఎం.బి మాల్ లోనే నిర్వహిస్తున్నారు.లేటెస్ట్ గా ఏ టీజర్ రిలీజ్ ఈవెంట్ అయినా కేరాఫ్ ఏ.ఎం.బి మాల్ అనేస్తున్నారు.రామ్ ది వారియర్ సాంగ్ రిలీజ్ అక్కడే చేశారు.ఈరోజు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రంగ రంగ వైభవంగా సినిమా టీజర్ ని కూడా ఏ.ఎం.బి మాల్ లోనే రిలీజ్ చేశారు.చిన్న చితకా ఫంక్షన్స్ కి ఏ.ఎం.బి మాల్ స్పెషల్ వెన్యూగా మారింది.ఈ విధంగా కూడా ఏ.ఎం.బి మాల్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడుతుందని చెప్పొచ్చు.