ఎప్పటి నుండో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో మేజర్ ఒకటి.టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా నటించిన ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యింది.
ఈ సినిమాను మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ అయినా జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ తో కలిపి నిర్మించాడు.మహేష్ బాబు ఈ సినిమాలో భాగం కావడంతో ముందు నుండి మహేష్ అభిమానులు సైతం ఈ సినిమాపై ద్రుష్టి పెట్టారు.
ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న కూడా కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది.ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదల అయ్యింది.
జూన్ 3న మేజర్ సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుని దూసుకు పోతుంది.ఈ సినిమా ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది.దీంతో ఈ సినిమా రెండవ వారంలోకి అడుగు పెట్టినా కూడా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతూ అందరిని ఆశ్చర్య పరుస్తుంది.
సాయీ మంజ్రేకర్, శోభిత దూళిపాళ్ల హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమాను శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేసాడు.
ఈ సినిమా ముందు నుండే భారీ అంచనాలను నెలకొల్పింది.ఆ అంచనాలను ఏ మాత్రం వమ్ము చేయకుండా ఈ సినిమా పాజిటివ్ టాక్ తో రన్ అవుతుంది.
ఈ సినిమాను రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు.

ఈ సినిమాను మొత్తం 35 కోట్ల ఖర్చుతో నిర్మించగా.థియేట్రికల్ బిజెనెస్ 27 కోట్లు మాత్రమే జరిగింది.కానీ వసూళ్లు మాత్రం సానుకూలంగా ఉండడంతో నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.బాలీవుడ్ లో కూడా రిలీజ్ అయినా ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుంది.
తాజాగా బాలీవుడ్ లో ఈ సినిమా ఎంత కలెక్షన్స్ రాబట్టిందో బయటకు వచ్చింది.

ఈ సినిమ మొత్తం 60 కోట్ల రుపాయలు కలెక్ట్ చేయగా బాలీవుడ్ లో 10.40 కోట్ల రూపాయలు రాబట్టి అందరిని ఆశ్చర్య పరుస్తుంది.ఇంకా రాబట్టే అవకాశాలు ఉన్నాయి.
మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత వసూళ్లు రాబడుతుందా అని మేకర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.