టాలీవుడ్ నంబర్ వన్ హీరో ఇతనే.. ఆ సర్వేలో ఏం తేలిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో నంబర్ వన్ హీరో ఎవరనే చర్చ అభిమానుల మధ్య చాలా సంవత్సరాల నుంచి చర్చ జరుగుతోంది.తాజాగా ఆర్మాక్స్ మీడియా మే నెల సర్వే ఫలితాలను ప్రకటించగా ఈ సర్వేలో ప్రభాస్ నంబర్ 1 హీరోగా నిలిచారు.

 Tollywood Top 10 Stars In Ormax Media Survery Details Here Goes Viral Tollywood-TeluguStop.com

మోస్ట్ పాపులర్ మేల్ స్టార్ జాబితాలో తొలి స్థానం ప్రభాస్ కు దక్కడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో ప్రభాస్ కు ఈ రికార్డ్ దక్కింది.

ప్రభాస్ తర్వాత స్థానంలో స్టార్ హీరో మహేష్ బాబు నిలిచారు.గత నెలలో మహేష్ నటించిన సర్కారు వారి పాట థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.

మహేష్ రెండో స్థానంలో నిలవడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.ప్రభాస్, మహేష్ తర్వాత స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిలిచారు.

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ 3వ స్థానంలో నిలిచారు.

Telugu Salaar, Allu Arjun, Ntr, Mahesh Babu, Ormax, Pawan Kalyan, Prabhas, Surve

స్టార్ హీరో అల్లు అర్జున్ ఈ జాబితాలో 4వ స్థానంలో ఉన్నారు.అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఆర్ఆర్ఆర్ సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న రామ్ చరణ్ ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచారు.

ఈ ఏడాది భీమ్లా నాయక్ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచారు.ఈ జాబితాలో నాని ఏడవ స్థానంలో నిలవగా విజయ్ దేవరకొండ ఎనిమిదో స్థానంలో నిలిచారు.

చిరంజీవి ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలవగా రవితేజ ఈ జాబితాలో పదో స్థానంలో ఉన్నారు.తమ ఫేవరెట్ హీరోలు వరుస విజయాలను సాధిస్తూ క్రేజ్ ను పెంచుకుంటూ ఉండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube