రానున్న ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్ధమవుతోంది బీజేపీ. ఎన్నడూ లేనంతగా తెలంగాణపై ఆ పార్టీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది.అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా.వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.హస్తిన పెద్దలు హైదరాబాద్‌లో వరుసగా ల్యాండవుతున్నారు.ప్రధాని మోదీ, కేంద్రమంత్రి షాల ద్వయం భాగ్యనగరానికొచ్చి.
కాషాయం శ్రేణుల్లో జోష్ నింపారు.పార్టీ బలోపేతానికి కసరత్తు చేస్తున్నారు.
మరోవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు భాగ్యనగరం వేదికగా జరగబోతున్నాయి.
ఇక బీజేపీ గ్రేటర్ కార్పొరేటర్లు ప్రధాని మోదీతో సమావేశమవుతున్నారు.
ఇవన్నీ చూస్తుంటే కాషాయ దళం దండయాత్ర మొదలుపెట్టేసింది.అసెంబ్లీ ఎన్నికల సమరానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది.
ప్రధాని నరేంద్రమోదీ మొదలు… తెలంగాణలోని ఆ పార్టీ ముఖ్యనేతల వరకు అంతా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ఉన్నారు.ఇక ఇప్పటికే ఢిల్లీ టు తెలంగాణ గల్లీ అంటూ అలజడి రేపుతోంది కాషాయపార్టీ.
ప్రతి సమస్యపైనా జెట్ స్పీడ్‌తో రియాక్ట్ అవుతోంది.తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కార్పొరేటర్లకు ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం హాట్‌టాపిక్‌గా మారింది.
గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ కార్పొరేటర్లతో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా ప్రధాని మోదీని కలవనున్నారు.సాయంత్రం 4గంటలకు ప్రధానితో భేటీ అవనున్న కమలనాథులు.
తెలంగాణలో తాజా పరిణామాలపై చర్చించనున్నారు.
ఈ నేపథ్యంలో ఇవాళ వారికి ప్రధాని ఏం చెబుతారోనన్న ఆసక్తి నెలకొంది.ఐతే ఇటీవల ఇండియన్ బిజినెస్ స్కూల్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సమయంలోనే.ప్రధాని మోదీ వారిని కలవాలనుకున్నా పరిస్థితులు అనుకూలించలేదని అంటున్నారు.
అయితే అందుకే ఇవాళ వారిని ఢిల్లీకి పిలిపించుకున్నట్టు తెలుస్తోంది.తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కార్పొరేటర్లకు ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం హాట్‌టాపిక్‌గా మారింది.
మొత్తానికి ప్రధాని స్థాయి వ్యక్తి.ఓ నగర కార్పొరేటర్లకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.