మేడ్చల్ జిల్లా ఘాట్కేసర్ టౌన్ లో నిన్న జరిగిన రెడ్డి సింహ గర్జన సభలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి అన్నోజిగుడా లోని ఎస్.బీ.అర్ గార్డెన్స్ లో ప్రెస్స్ మీట్ నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు,ఈ సందర్భంగా టి.పిసిసి లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి పై జరిగిన దాడికి టీ.పిసిసి అధ్యక్షులు ఎంపి రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని వారు తెలిపారు రెడ్డి సింహ గర్జన సభలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పదే పదే తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,దళిత బంధు పథకం,రైతు బంధు పథకం తదితర పథకాల గురించి మాట్లాడడం తప్ప రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు మీద ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోడం వల్ల సభలో ఉన్న వారు ఆగ్రహానికి గురై మంత్రి పై దాడి చేశారని ఆ దాడిని రేవంత్ రెడ్డికి అంటగట్టి రాజకీయం చేయడం తగదని,ఇప్పటికైనా ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు మానుకోవాలని మంత్రి మల్లారెడ్డికి వారు హితువు పలికారు కాంగ్రెస్ నాయకుల పై కార్యకర్తల పై తప్పుడు కేసులు పెడితే తాము భయపడే ప్రసక్తే లేదని చర్యలకు ప్రతి చర్యలు ఉంటాయని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభాకర్ రెడ్డి,సంజీవ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,మాధవ్ రెడ్డి,జలంధర్ రెడ్డి,దావీధ్ రెడ్డి,ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .




తాజా వార్తలు