రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పై ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి నాగేశ్వరరావు పేర్కొన్నారు విశాఖ కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.ధాన్యం కొనుగోలుపై వచ్చిన వార్తలు వాస్తవం కాదన్నారు.
ఆర్.బీ.కే ల ద్వారా రైతుల దగ్గర ఉన్న ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు.చంద్రబాబు జాకీ వేసి లేపే ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కొన్ని పత్రికలను ఉద్దేశించి అన్నారు సివిల్ సప్లై విధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా చూస్తున్నామని బియ్యం కొనుగోలు పై తాను చేసిన వ్యాఖ్యలకు ఎంపీ సుభాష్ చంద్రబోస్ వివరణ ఇచ్చారని… ఆయన చెప్పిందొకటి పత్రికల్లో దుష్ప్రచారం చేసింది మరొకటి అని పౌరసరఫరాల శాఖ మంత్రి నాగేశ్వరావు అన్నారు.
ప్రతి గింజ కొనుగోలు చేయాలన్నది సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశమని రైతులకు బిల్లింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైందని వివరించారు