తెలుగుదేశం ప్రభుత్వం లో మంత్రిగా ఒక వెలుగు వెలిగిన గంటా శ్రీనివాసరావు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నుంచి అనుమానస్పదం గానే వ్యవహరిస్తూ వచ్చారు.వైసీపీలో చేరేందుకు ఎన్నికల సమయంలో గట్టి ప్రయత్నాలు చేసినా, కొంతమంది వైసిపి కీలక నాయకులు గంటా చేరికను అడ్డుకోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
తప్పనిసరి పరిస్థితుల్లో టిడిపి నుంచే మళ్ళీ పోటీ చేసి గెలుపొందారు.గెలిచిన దగ్గర నుంచి ఆ పార్టీతో దూరంగానే ఉంటూ వస్తున్నారు.
పార్టీ కీలక సమావేశాలకు సైతం గంట గంటా డుమ్మా కొడుతూ వస్తున్నారు.వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు ఆయన దూరంగానే ఉంటూ వస్తున్నారు.
ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటీకరించబోతున్నట్లు ప్రకటన చేసిన వెంటనే.గంటా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
ఇక అప్పటి నుంచి ఆయన సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు.
ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో టిడిపిలో ఉంటేనే బెటర్ అన్న ఆలోచన తో గత కొద్ది రోజులుగా పార్టీలో యాక్టివ్ అయ్యారు.
ఇటీవల విశాఖ లో చంద్రబాబు పర్యటించిన సందర్భంలో ఎయిర్ పోర్ట్ కి వెళ్లి మరి ఆయనకు స్వాగతం పలికారు.కానీ అందరు నేతలను పలకరించినట్టు గానే చంద్రబాబు గంటాను పలకరించి లైట్ తీసుకున్నారు.
పార్టీలో గంటా శ్రీనివాసరావు ఉన్నా.లేనట్టుగానే వ్యవహరిస్తుండడం పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు దూరంగా ఉండటం వంటి వ్యవహారాలతో చాలా కాలంగా చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
దీంతో భీమిలిలో చంద్రబాబు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి గంటా శ్రీనివాసరావు దూరంగానే ఉన్నారు.అయితే ఆయన బిజెపి జనసేన ల్లో ఏదో ఒక పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతుండగా దానిని వారి అనుచరులు కొట్టిపారేస్తున్నారు.

ఆయన టిడిపిలో యాక్టివ్ అవుతారని గంటా ముఖ్య అనుచరులు చెబుతున్నారు.అయితే గంటా కు చంద్రబాబు వద్ద ప్రాధాన్యం దక్కకుండా టీడీపీలో మరో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట.పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కకపోవడాన్ని, తాను పూర్తిగా పార్టీలో యాక్టివ్ అయ్యి పార్టీ కోసం కష్టపడి పని చేస్తాననే విధంగా దేనిపైనా గంటా ప్రకటన చేయకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.అయితే ఆయన చంద్రబాబు వద్దే అనేక అంశాలపై చర్చించి పార్టీలో కీలకం అయ్యేనుకు ప్రయత్నాలు చేస్తున్నా, దానికి అయ్యన్నపాత్రుడు ఎప్పటికప్పుడు అడ్డుపడుతూ ఉండటంతోనే గంటా ఎటూ తేల్చుకోలేక మౌనంగా ఉండు పోతున్నట్లు సమాచారం.