నూతన కలెక్టరేట్ భవననిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి:- మంత్రి పువ్వాడ ఆదేశం

ఖమ్మం నగరంలో నూతన కలెక్టరేట్ భవన సముదాయం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

 Construction Work Of The New Collectorate Should Be Completed Expeditiously: - O-TeluguStop.com

శనివారం జిల్లా కలెక్టర్ విపి గౌతంతో కలిసి వివి.

పాలం గ్రామ సమీపంలో నిర్మితమవుతున్న నూతన కలెక్టరేట్ కార్యాలయ భవన సముదాయ నిర్మాణ పనుల పురోగతిని మంత్రి పువ్వాడ పరిశీలించారు.

భవన నిర్మాణం, ప్రాంగణానికి సంబందించిన ప్లాన్ ను పరిశీలిస్తూ, ప్లాన్ ప్రకారంగా పనులను కొనసాగుతున్నాయా లేదా అని పరిశీలించారు.

నూతన కలెక్టరేట్‌ భవన నిర్మాణాన్ని 44కోట్లతో 1,69,000వేల చ.అ.విస్తీర్ణంలో చేపడుతున్నట్లు అధికారులు వివరించారు.

ఇప్పటికే మెయిన్‌ బిల్డింగ్‌ స్లాబ్లు నిర్మాణ పనులు పూర్తి కాగా, సివిల్ పనులు జరుగుతున్నట్లు అధికారులు వివరించారు.

పలు గదులు ఇప్పటికే ఫ్లోరింగ్ పనులు సైతం పూర్తి అయ్యాయని పేర్కొన్నారు.

భవనం మొత్తం తిరిగి విద్యుత్‌ పనులు, ప్యాన్ల ఏర్పాటు, డ్రైనేజీ, నీటి సరఫరా, పార్కింగ్‌, టైల్స్‌ పనులు వివరాలను అధికారులను అడిగి తెలసుకున్నారు.

భవన ప్రాంగణం ముందు భాగం మొత్తం చదును చేయాలని, చదును చేసిన అనంతరం నడక దారి, కాంపౌండ్ వాల్ చేపట్టాలని సూచించారు.

భవన సముదాయం వెనక భాగంలో సీసీ రోడ్డు, పాత్ వే పనులను పరిశీలించారు.

భవనం గోడకు ఆనుకొని పాట్ ప్లాంటింగ్ ఉండాలని, ఆ తర్వాత వరుసలో మొక్కలు ప్లాంటేషన్ చేసి, ప్లాంటేషన్ తర్వాత సీసీ రోడ్ చేపట్టాలన్నారు.

భవన సముదాయం మధ్యలో చేపట్టవల్సిన ప్లాంటింగ్, లాన్ పనులను సుందరంగా కనబడేట్లు చేపట్టాలన్నారు.

వాహనాల పార్కింగ్, ఇతర పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.పూర్తవుతున్న పనుల వివరాల నివేదికను అందివ్వాలన్నారు.

ఇప్పటికీ చాలా ఆలస్యం జరిగిందని, పనులు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయని, అదనపు కార్మికులను కేటాయించి పనుల వేగం పెంచాలని అదేశించారు.

ఈ కార్యక్రమంలో జడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్, సుడా చైర్మన్ బచ్చు విజయ్, రోడ్లు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్యాoప్రసాద్ తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube