బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం ఇప్పటికే 8 వారాలు పూర్తి చేసుకుని తొమ్మిదవ వారంలోకి అడుగుపెట్టింది.ఇక 9వ వారంలో భాగంగా నామినేషన్ ప్రక్రియలో ఏడు మంది కంటెస్టెంట్ లు ఈ వారం నామినేషన్ లో ఉన్నారు.
అఖిల్, బిందు, అషూరెడ్డి తప్ప మిగతా హౌస్ మేట్స్ అంతా నామినేషన్స్ లో ఉన్నారు.ఇక ఈ విధంగా నామినేషన్ లో ఉన్న వారిలో ఈవారం తప్పనిసరిగా నటరాజ్ మాస్టర్ ఇంటి నుంచి బయటకు వస్తారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
తాజాగా ఓటింగ్ ప్రకారం చూసుకుంటే మిత్రశర్మ తన అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ తో విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకున్నారని తెలుస్తోంది.ఇలా ఓటింగ్ లో మిత్ర మొదటి స్థానంలో ఉన్నారు.
విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాంకర్ శివని సైతం బీట్ చేసి మొదటి స్థానంలో ఉండగా, శివ రెండవ స్థానంలో ఉన్నారు.ఇక బాబా భాస్కర్ మాస్టర్ కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నారు.
ఇలా ఈ ముగ్గురు కంటెస్టెంట్ లు సేఫ్ జోన్ లో ఉండగా మిగిలిన నలుగురు డేంజర్ లో ఉన్నారు.

ఇకపోతే సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో డబల్ ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తోంది.ఒకవేళ డబల్ ఎలిమినేషన్ కనుక ఉంటే ఎవరు బిగ్ బాస్ నుంచి బయటకు రానున్నారు అనే విషయానికి వస్తే… నటరాజ్ మాస్టర్ కిల్లర్ టాస్క్ ని చాలాబాగా ఆడటం వల్లే ఓటింగ్ ముందంజలో ఉన్నారు.హమీద కూడా సేఫ్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక డేంజర్ జోన్ లో ఉన్నటువంటి అనిల్, అరీయనా ఇద్దరూ ఈ వారం బయటకి రానున్నట్లు సమాచారం.మరి వీరిద్దరిలో ఎవరు బయటికి వస్తారు? లేదా ఇద్దరు బయటకు వస్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది.