రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధంపై ప్రపంచమంతా దృష్టి సారించింది.ప్రస్తుతం ఉక్రెయిన్ పౌరులు తమ దేశాన్ని రక్షించడానికి సైన్యంతో యుద్ధానికి తలపడుతున్నారు.
యువకుల నుండి వృద్ధుల వరకు అందరూ తమ దేశాన్ని రక్షించుకోవడానికి తుపాకీలను చేతపట్టారు. రష్యాకు వ్యతిరేకంగా స్థానిక పౌరులు కూడా ఉక్రేనియన్ సైన్యంతో మమేకమైన కథనాలు ప్రతిరోజూ వినిపిస్తున్నాయి.
ఈ నేపధ్యంలోనే ఉక్రెయిన్‌కు చెందిన ఓ జంట వార్తల్లో నిలిచింది.ఈ జంటకుగల దేశభక్తికి ప్రపంచవ్యాప్తంగా అభినందనలు అందుతున్నాయి.
ఈ జంటకు వివాహం జరిగిన కొన్ని గంటల అనంతరం రష్యా ఉక్రెయిన్‌పై దాడికి దిగింది.
ఉక్రెయిన్‌ను నాశనం చేయాలనే ఉద్దేశంతో రష్యా ఆ దేశంపై తెగబడింది.
ఉక్రెయిన్ పౌరులు రష్యా దాడులకు తప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.కాగా ఉక్రెయిన్‌కు చెందిన స్వ్యటోస్లావ్ ఫర్సిన్, యరీనా అరేవా ఫిబ్రవరి 22న వివాహం చేసుకున్నారు.
కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.అయితే పెళ్లయిన వెంటనే యుద్ధంతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాల్సివస్తుందని ఆలోచన వారికి ఎన్నడూ కలగలేదు.
వీరు తమ వివాహం తర్వాత దేశం కోసం తుపాకీ పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.స్వ్యటోస్లావ్ వయస్సు 24 సంవత్సరాలు.
యారినా వయస్సు 21 సంవత్సరాలు.వీరి వివాహం మే 2021లోనే జరగాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ పెళ్లి వాయిదా పడింది.
ఎట్టకేలకు వారి వివాహం 2022 ఫిబ్రవరి 22న జరిగింది.వారు సెయింట్ మైఖేల్ మొనాస్టరీలో వివాహం చేసుకున్నప్పుడు… రష్యా అధ్యక్షుడు పుతిన్.ఉక్రెయిన్‌పై దాడిని ప్రకటించారు.రాజధాని కైవ్‌లో నివసిస్తున్న ఈ జంట యుద్ధ సమయంలో పెళ్లి చేసుకోవలసి వచ్చింది.పెళ్లయ్యాక తమ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకున్న ఈ జంట దేశం కోసం పోరాడాలని నిర్ణయించుకుంది.పెళ్లయిన వెంటనే తమ దేశాన్ని రక్షించే పనిని వారు చేప్టటారు.
ఈ జంట తుపాకీని చేతబట్టడంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.యారినా తన ఫేస్‌బుక్ పేజీ నుండి ఒక ఫొటోను షేర్ చేసింది, అందులో ఆమె, ఆమె భర్త ఏకే-47 పట్టుకొని కనిపిస్తున్నారు.
యారినా తెలిపిన వివరాల ప్రకారం, ఉక్రెయిన్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది.ప్రజల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి.
తమ భవిష్యత్తు కోసం ఈ పోరాటం చేస్తున్నాం.కలిసి చనిపోయినా దేశం కోసం ప్రాణాలర్పించినందుకు గర్వపడతామన్నారు.
అయితే త్వరలోనే యుద్ధం ముగిసి మళ్లీ హ్యాపీ లైఫ్ స్టార్ట్ అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.