సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది వారి టాలెంట్ సోషల్ మీడియా వేదికగా బయట పెడుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా కొనసాగుతున్నారు.ఈ క్రమంలోనే గల్లీ బాయ్స్ రియాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈయన ఎన్నో వెబ్ సిరీస్ లోను ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇక నటుడిగా పలు సినిమాలలో సందడి చేసిన రియాజ్ యూట్యూబ్ ద్వారా ఎన్నో వీడియోల ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్నారు.
ఈ విధంగా తన అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకొని సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన వీడియోలను ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.
చూడటానికి చాలా పొట్టిగా ఉన్న రియాజ్ గురించి ఎన్నో రకాల కామెంట్లు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇకపోతే ఎంతో పొట్టిగా ఉండే రియాజ్ తాజాగా ఓ ఇంటివాడైనట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఆయన వివాహం నజీరా అనే అమ్మాయితో ఎంతో ఘనంగా జరిగింది.ఈ క్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక వీరి పెళ్లి ఫోటోను బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేస్తూ తనకు పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియజేసింది.
ఈ సందర్భంగా అషు రెడ్డి ఇలా మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రియాజ్ అండ్ నజీరా అంటూ వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోని ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేస్తూ వీరికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక పోతే రియాజ్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే విషయం అందరికి తెలిసిందే ఈ క్రమంలోనే ఈయన గతంలో జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన సంగతి కూడా తెలిసిందే.ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్ గా ఉండే రియాజ్ నిత్యం ఏదో ఒక వీడియో ద్వారా అభిమానులను సందడి చేస్తుంటారు.
ప్రస్తుతం తన పెళ్లికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.