తెలుగు బిగ్ బాస్ ప్రేక్షకుల ముందుకు మరో భారీ షో రాబోతుంది.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రాబోతున్న ఈ బిగ్ బాస్ కి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే గత బిగ్ బాస్ సీజన్ లో సందడి చేసిన కంటెస్టెంట్స్ పలువురు ఈ సీజన్ కి హాజరు కాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.పాత కొత్త వారి కలయికలో రాబోతున్న ఈ సరికొత్త డిజిటల్ బిగ్ బాస్ కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బిగ్ బాస్ బజ్ అంటూ ప్రతి వారం ఒక ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేయడం జరుగుతుంది.ఆ ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన వారి ఇంటర్వ్యూ లు చూపిస్తారు.
ఆ ఇంటర్వ్యూలు చేసేది బిగ్ బాస్ గత సీజన్ కి చెందిన వారు ఉంటారు.మొన్నటి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ బజ్ కి అరియానా యాంకర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
ఆమె ఇప్పుడు ఈ సీజన్ కి కంటెస్టెంట్ గా ఉంటున్నారు కనుక ఆమె స్థానంలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.ఆర్జే కాజల్ మొదలుకొని శ్రీరామ చంద్ర వరకు పలువురి పేరు ప్రస్తావనకు వచ్చాయి.పేర్లు ఇప్పటి వరకు వచ్చిన పేర్లలో తాజాగా యాంకర్ రవి పేరు కూడా వినిపిస్తోంది.యాంకర్ గా ఇప్పటికే సుధీర్ఘ అనుభవం ఉన్న ఆయన ఈ ఎపిసోడ్ లు చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది అనే నమ్మకం నిర్వాహకులు వ్యక్తం చేస్తున్నారట.
ఆయన పారితోషికం కాస్త ఎక్కువైనా కూడా ఆయనతోనే నిర్వహించాలని కొందరు భావిస్తున్నారని సమాచారం అందుతోంది.కానీ ఆయన బిగ్ బాస్ పై కోపంతో ఉన్నాడు. తనను సీజన్ 5 నుండి ఎలిమినేట్ చేయడం ద్వారా పరువు తీశారు అంటూ గతంలో పలు సార్లు విమర్శలు చేయడం జరిగింది.మరి ఈ సారి హోస్ట్ గా ఆయన చేస్తాడా అనేది చూడాలి.
బిగ్ బాస్ షో మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే.ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ఓటీటీ షో సూపర్ హిట్ అవుతుంది అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.