ఈ కాలంలో పిల్లలు ఎలా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మాటల్లో కానివ్వండి, చేతల్లో కానివ్వండి చిచ్చర పిడుగుల్లాగ దూసుకుని వెళ్లిపోతున్నారు.
ప్రతిభకు వయసుతో పని లేదని 18 నెలల పసివాడు నిరూపించాడు.మాటలు కూడా ఇంకా సరిగా రాని ఈ బుడ్డోడు ఏకంగా ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ లో ఆరితేరి పోయాడు.
తన తల్లి అడిగే ప్రశ్నలకు అసలు ఆలోచించ కుండా సమాధానం చెబుతూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు.వివరాల్లోకి వెళితే.
జార్ఖాండ్కి చెందిన గూగుల్ బాయ్‌గా సోషల్ మీడియాలో ఈ బాబు తెగ వైరల్ అవుతున్నాడు.ప్రస్తుత కంప్యూటర్ యుగంలో పిల్లలు ఏదయినా సరే ఇట్టే పట్టేస్తున్నారు.
ఇంకా అమ్మ, నాన్న అనే పదాలు కూడా సరిగ్గా పలకడం రాని జార్ఖాండ్ కి చెందిన 18 నెలల బాలుడు ఇప్పుడు గూగుల్బాయ్ గా అందరికి పరిచయం అయ్యాడు.నిజానికి ఈ బుడ్డోడు పేరు అంకుష్రాజ్.
గిరి దిహ్ మండలం లోని మారుమూల గ్రామ కుబరిలో ఉన్నాడు ఈ బాలుడు.ఊరికి సరిగా రవాణా, స్కూల్ సౌకర్యాలు కూడా లేవు కానీ 18 నెలల అంకుష్రాజ్ తనకు ఉన్న అసాధారణ జ్ఞాపకశక్తి, అపారమైన తెలివితేటలతో ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ లో పట్టు సాధించాడు.
ఈ బాలుడులో ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే ఏదైనా ఒక్కసారి చెబితే చాలు ఆ మాటలు అలా తన బుర్రలో నాటుకుని పోతాయి.
ఆ మాటలనే చిలక పలుకులుగా పలుకుతాడు.పక్షలు, జంతువులు, పూలు, కాయలు, ప్రదానమంత్రి, సీఎం పేర్లను సైతం అడిగిన వెంటనే టక్కున సమాధానం చెప్పేస్తాడు.అంకుష్రాజ్ తండ్రి అశోక్‌యాదవ్ ఒడిషాలో ఒక ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
తల్లి నిషాభారతి హౌస్‌వైఫ్‌గా ఉంటూ ఇంట్లోనే ఉంటుంది.బిడ్డ యొక్క టాలెంట్ ను గుర్తించిన వాళ్ళ అమ్మ తన బిడ్డ కోసం ఓ పుస్తకాన్ని కొనుక్కొచ్చి వాటిని చిన్నారితో చదివించి అప్పజెప్పించడం చేస్తోంది.
పిల్లాడికి చదువు చెప్పించాలన్న తపనతో నిషాభారతి కూడా హిస్టరీ హానర్స్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసింది.ఇప్పుడే వీడు ఇలా ఉంటే ఇంకా పెద్దయ్యాక ఎన్ని అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలి మరి.