నిర్మాతలను భయపెడుతున్న హీరోయిన్ అమలాపాల్ కండీషన్.. ఆ షరతు ఏంటో తెలుసా?

తెలుగులో తక్కువ సినిమాలే చేసినా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరోయిన్లలో అమలాపాల్ ఒకరనే సంగతి తెలిసిందే.నాయక్, ఇద్దరమ్మాయిలతో సినిమాలలో నటించడం ద్వారా తెలుగులో ఈ హీరోయిన్ కు ఊహించని స్థాయిలో పాపులారిటీ దక్కింది.

 Star Heroine Amala Paul Shocking Conditions To Producers Goes Viral , Amala Pau-TeluguStop.com

అయితే తర్వాత రోజుల్లో కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల అమలాపాల్ కెరీర్ విషయంలో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు.తమిళంలో అమలాపాల్ నటించిన కొన్ని సినిమాలు హిట్టయ్యాయి.

అయితే పెళ్లి తర్వాత అమలాపాల్ కు సినిమా ఆఫర్లు తగ్గాయి. విడాకుల ప్రకటన తర్వాత అమలాపాల్ మళ్లీ సినిమా ఆఫర్లతో బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

తెలుగులో కూడా అమలాపాల్ కు సినిమా ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.అయితే ఆమె డిమాండ్ చేస్తున్న రెమ్యునరేషన్ గురించి విని షాకవ్వడం నిర్మాతల వంతవుతోంది.తాజాగా ఒక స్టార్ హీరో సినిమా కోసం మేకర్స్ అమలాపాల్ ను సంప్రదించారు.

అయితే ఊహించని స్థాయిలో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేయడంతో అంత ఇవ్వలేమని నిర్మాతలు చెప్పినట్టు తెలుస్తోంది.అమలా పాల్ కెరీర్ విషయంలో తప్పటడుగులు వేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అమలా పాల్ ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

అమలా పాల్ కు తమిళంలో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు లేవనే విషయం తెలిసిందే.గతంలో కూడా పలు వివాదాల ద్వారా అమలాపాల్ వార్తల్లో నిలిచారు.

ది ఘోస్ట్ సినిమా ఆఫర్ విషయంలో అమలా పాల్ ఈ విధంగా వ్యవహరించినట్టు సమాచారం అందుతోంది.ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట కాజల్ ఎంపిక కాగా కొన్ని కారణాల వల్ల కాజల్ తప్పుకున్నారు.ప్రస్తుతం మేకర్స్ మరో హీరోయిన్ ను వెతికే పనిలో ఉన్నారని తెలుస్తోంది.అమలా పాల్ మంచి ఆఫర్లను వదులుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడక తప్పదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube