ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ఎంతోమంది ఈ సాంకేతికతను ఉపయోగించుకుని యూట్యూబ్ ఛానల్ ద్వారా షార్ట్ ఫిలిమ్స్, వీడియోస్, వెబ్ సిరీస్ చేస్తూ తమలో ఉన్న టాలెంట్ మొత్తం బయట పెడుతున్నారు.ఈ విధంగా ఇలాంటి వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దేత్తడి హారిక ఒకరు.
ఈమె ఎన్నో యూట్యూబ్ వీడియోలు ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనంతరం బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అవకాశాన్ని దక్కించుకున్నారు.ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ లో తన యాటిట్యూడ్ పరంగా అందరిని ఆకట్టుకొని బిగ్ బాస్ చివరి వారాల వరకు హౌస్ లో కొనసాగి ఎంతో మంచి క్రేజ్ దక్కించుకున్నారు.
ఈ విధంగా బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్న దేత్తడి హారిక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతమైన అవకాశాలు అందుకుంటూ ఉన్నారు.ఈమెకు బిగ్ బాస్ ద్వారా వచ్చిన పాపులారిటీ యూట్యూబ్ ఛానల్ కి ఎక్కువ వెండితెరకు తక్కువ అనే విధంగా ఉంది.
ఈమెలో ఎంతో టాలెంట్, మంచి మాస్ మసాలా కంటెంట్ ఉన్నప్పటికీ ఈమె మాత్రం వెండితెరపై అవకాశాలను దక్కించుకోలేకపోయింది.అయితే ఈమెకు వెండితెరపై అవకాశాలు రాకపోవడానికి గల కారణం ఈమె హైట్ అని మాత్రమే చెప్పాలి.
దేత్తడి హారిక చాలా పొట్టిగా ఉండటం వల్ల ఈమెకు ఇదే పెద్ద సమస్యగా మారిపోయింది.ఈ విధంగా తన ఎత్తు తన కెరియర్ కి ఎంతో ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి.సోషల్ మీడియా వేదికగా ఈమె ఏదైనా ఒక ఫోటోని షేర్ చేసింది అంటే ఆ ఫోటోకి ఎన్నో లైక్స్ కామెంట్స్ వస్తాయి.అయితే ఈ కామెంట్ లో ఎక్కువగా ఆమె హైట్ గురించి ప్రస్తావన వస్తూ బుడ్డది,పొట్టిది అంటూ కామెంట్లు చేస్తుంటారు ఈ విధంగా తన గురించి కామెంట్లు చేయడంతో ఈమె ఎన్నో సార్లు విసిగిపోయి చివరికి తన గురించి ఈ విధంగా కామెంట్ చేసిన వారికి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు.
ఎన్టీఆర్ నటించిన రామయ్యా వస్తావయ్యా సినిమాలో భాగంగా ఎన్టీఆర్ చెప్పే డైలాగ్.బుడ్డోడు.బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా.అలా పిలవాలంటే వారికి ఏదైనా అర్హత ఉండాలి లేదంటే వాడు నా అభిమాని అయి ఉండాలి అంటూ ఎన్టీఆర్ చెప్పే ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయింది.
ఈ విధంగా ఎవరైనా సరే ఇతరులను బుడ్డోడు పొట్టిది అంటే వెంటనే ఇదే డైలాగ్ గుర్తుకొస్తుంది.ఈ విధంగా ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఉపయోగించి ఎంతోమంది కౌంటర్లు వేసేవారు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం దేత్తడి హారిక వంతు వచ్చింది.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేస్తూ అది అర్థమైంది కదా??అంటూ తన ఎత్తు గురించి ట్రోల్ చేసే వారికి బాగా అర్థమయ్యే విధంగా హారిక ఎన్టీఆర్ స్టైల్ లో మాస్ వార్నింగ్ ఇచ్చింది.మొత్తానికి హారిక ఇచ్చిన వార్నింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.