గ్రామ దేవతలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి?

గ్రామాల్లో ఉండే దేవతలను పోచమ్మ, ఎల్లమ్మ, మాంకాళమ్మ, మాతమ్మ, మార్లమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, మైసమ్మ, గంగమ్మ, బాలమ్మ… ఇలా చాలా పేర్లతో పిలుస్తుంటారు.అసలా అమ్మవార్లకు ఆ పేర్లు ఎలా వచ్చాయి.

 Story Behind The Names Of Village Godesses, Villege Gods , Villege , Temples , Y-TeluguStop.com

ఎవరు ఆ పేర్లను పెట్టారో తెలుసుకుందాం.

పొలిమేరలో ఉండి కాపాడుతుంది కాబట్టి పొలిమేరమ్మని పిలుచుకున్నారు.

ఆ పేరు క్రమ క్రమంగా పోలేరమ్మగా మారిపోయింది.ఎల్ల(సరిహద్దు)లో ఉండే అమ్మ కాబట్టి.

ఎల్లమ్మగా మారింది.చల్లగా చూసే తల్లిని శీతలాంబగా పిలుచుకున్నారు.

బతుకుకి అవసరమైనవన్నీ సమకూర్చే తల్లిని బతుకమ్మగా మార్చేశారు.పోషించే తల్లిని పోషమ్మగా పిలిచారు.

అంతే కాకుండా కష్టాలను పోచలా (గడ్డిపరక) తీసి పడేస్తుంది కనుక ఆ పేరొచ్చిందని కూడా కొందరు చెబుతుంటారు.ప్రాణాధారమైన ప్రకృతి వనరులను దేవతలుగా ఆరాధిస్తూ… వాటినే అమ్మవార్లుగా మార్చేశారు మన పెద్దలు.

అందులో భాగంగానే గంగానదిని గంగానమ్మగా మార్చేశారు.అగ్నికి మారు పేరుతో అగ్గమ్మ, బూడిదని(బుగ్గి) విభూతిగా భావించే తల్లి బుగ్గమ్మగా, ఆకాశమంత ఎత్తులో వున్నందున కొండమ్మ అంటూ పూజిస్తారు.సూర్య చంద్రులకు ప్రతీకలుగా కొన్ని ప్రాంతాల్లో సూరీడమ్మ, చంద్రమ్మ  అనే దేవతలు కూడా ఉన్నారు.వీరందరికీ ఏటా ఆషాఢ మాసంలో పూజలు, పండుగలు చేస్తారు.గ్రామ దేవతలకు బోనాలు తీసి ప్రతీ ఏటా పండుగ చేస్తారు.కొందరు అమ్మవార్లకు మేకలు, కోళ్లను బలివ్వగా… మరి కొందరు అమ్మవార్లకు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.

ఏ రకంగా పండుగ చేసినా, ఏ పేరున పిలిచినా అమ్మవార్ల కరుణతో దయతలుస్తాయి.గ్రామాన్ని చల్లగా కాపాడుతాయని భక్తుల విశ్వాసం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube