ఫైనల్ కోసం యంగ్ క్రికెటర్స్ కి కీలక సూచనలు చేసిన కింగ్ కోహ్లీ..!

ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్ లో భాగంగా టీమిండియా కుర్రాళ్ళు అదరగొడుతున్నారు.ఊహించినదానికంటే టీమిండియా కుర్రాళ్ళు ఇతర దేశాల వారికి ఎక్కడ చోటివ్వకుండా పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ మరోసారి టీమిండియాను ఫైనల్ కు చేర్చారు.

 King Kohli Makes Key Suggestions To Young Cricketers For Final Final, Under 19,-TeluguStop.com

తాజాగా సెమీఫైనల్లో టీమ్ ఇండియా కుర్రాళ్ళు ఆస్ట్రేలియా జట్టుపై ఘన విజయం సాధించారు.దీంతో టీమిండియా కుర్రాళ్ళు మొత్తం ఎనిమిది సార్లు ప్రపంచ కప్ ఫైనల్ కు చేరినట్లైంది.

ఇందులో మొత్తం నాలుగు సార్లు టీమిండియా విజేతగా నిలిచిన మరో మూడు సార్లు ఓడిపోయింది.

ఇది ఇలా ఉండగా కుర్రాళ్ళలో మరింత జోష్ పెంచడానికి విరాట్ కోహ్లీ అండర్-19 జట్టు సభ్యులతో వీడియో కాల్ లో సంభాషించాడు.

ఈ విషయాన్ని అండర్ 19 జట్టు సభ్యులు కౌశల్ తాంబే మరో ఇద్దరు ఆటగాళ్ళు సోషల్ మీడియాలో వివరించగా దాంతో విరాట్ కోహ్లీ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.యంగ్ క్రికెటర్ సభ్యులు సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ భయ్యాతో తాము చాట్ చేయడం నిజంగా ఎంతో ఆనందంగా ఉందని.

తన నుంచి జీవితంతో పాటు, క్రికెట్ కు  సంబంధించిన ఎన్నో విషయాలు తమకు తెలియ పరచాలని ఇది ముందు ముందు తమకు ఎంతగానో సహాయ పడుతుందని వారు పేర్కొన్నారు.మరికొందరు ఫైనల్ కు ముందు ఒక గొప్ప ఆటగాడు నుంచి తాము విలువైన సూచనలు అందుకున్నమంటూ చెప్పుకొచ్చాడు.

ఇకపోతే సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన టీమిండియా జట్టు సభ్యులు ఫైనల్లో శనివారం నాడు ఇంగ్లండ్ జట్టుపై అమీతుమీ తేల్చుకోనుంది.ఇప్పుడు వరకు నాలుగు సార్లు టైటిల్ నెగ్గిన టీమిండియా మరో సారి టైటిల్ ఎగరేసుకుపోవడం ఖాయమంటున్నారు నెటిజన్లు.ఇంత వరకు అండర్ 19 వరల్డ్ కప్ ను భారత్ నాలుగు సార్లు గెలుచుకోగా ఆస్ట్రేలియా జట్టు మూడుసార్లు కైవసం చేసుకున్నాయి.

King Kohli Makes Key Suggestions To Young Cricketers For Final Final, Under 19, Sports Update, Viral Latest, Virat Kohli, Suggest - Telugu Final, Suggest, Latest, Virat Kohli

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube