ఎన్నో అంచనాల నడుమ వచ్చిన కేంద్ర బడ్జెట్ తెలుగు రాష్ట్రాలకు పెద్ద నిరాశే మిగిల్చింది.ఇక ఏపీకి అయితే మరింత అన్యాయం చేసింది.
పోలవరం ప్రాజెక్టుకు గానీ.విశాఖ రైల్వే జోన్‌లకు గానీ లేదంటే కడప ఉక్కు కర్మాగారానికి గానీ నిదులు ఇవ్వలేదు.
పైగా కొత్త ప్రాజెక్టులు కూడా ఏమీ లేదు.గతంలో కూడా ఎలాంటి కొత్త ప్రాజెక్టులు ప్రకటించలేదు.
ఇక విభజన హామీల్లో ఉన్న ఒక్క దాన్ని కూడా ప్రస్తావించకుండానే బడ్జెట్ ముగిసింది.ఎన్నో ఆశలతో టీవీలకు అతుక్కు పోయిన ప్రజలకు తీవ్ర అన్యాయమే జరిగింది.
నిజానికి ప్రత్యేక హోదా లాంటిది ఏదైనా వస్తుందేమో అని ప్రతిసారి ఇలాగే ఎదురు చూడటం చివరకు నిరాశతో ఉండి పోవడం జరుగుతోంది.కనీసం ప్రత్యేక ప్యాకేజీ లాంటిది కూడా ఏమీ రావట్లేదు.
అయితే ఎంపీల పరంగా దేశంలోనే నాలుగో పెద్ద పార్టీగా ఉన్న వైసీపీ మాత్రం ఇంత అన్యాయం జరుగుతున్నా సరే నోరు విప్పట్లేదు.కనీసం సభల్లో తమ వాయిస్ కూడా బలంగా వినిపించలేక పోతున్నారు.
కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారు.జగన్ కూడా దానిమీద స్పందించకపోవడం గమనార్హం.
అదే కేసీఆర్ మాత్రం ప్రెస్ మీట్ పెట్టి మరీ కేంద్రాన్ని ఏకిపారేస్తున్నారు.తెలంగాణకు అన్యాయం చేసిందంటూ టీఆర్ ఎస్ ఎంపీలు కూడా బలంగానే మాట్లాడుతున్నారు.మిత్ర పక్షాలతో కలిసి ఆందోళన చేసేందుకు కూడా ప్లాన్ చేసుకుంటోంది టీఆర్ ఎస్.మరి వైసీపీ పరిస్థితి ఏంటి అంటే మాత్రం ఆన్సర్ దొరకట్లేదు.వైసీపీ ఎందుకు ఇలా చేస్తుందో మాత్రం ఎవరికీ పెద్దగా అర్థం కావట్లేదు.ఇంకా చెప్పాలంటే రాబోయే రోజుల్లో నిధులు మరింత తగ్గించుకుంటూ వచ్చినా మౌనంగానే ఉండేటట్లు కనిపిస్తోంది.
దీనిపై విమర్శలు కూడా వస్తున్నాయి. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.