డార్క్ అండర్ ఆర్మ్స్.ఎందరినో వేధించే కామన్ సమస్య ఇది.
చెమటలు అధికంగా పట్టడం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, రెగ్యులర్‌గా షేవ్ చేసుకోవడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వంటి కారణాల వల్ల అండర్ ఆర్మ్స్ డార్క్‌గా మారి పోతుంటాయి.దాంతో ఈ సమస్యను నివారించుకునేందుకు మార్కెట్‌లో దొరికే రకరకాల క్రీములు వాడుతుంటారు.
అయినప్పటికీ తగ్గక పోతే ఏం చేయాలో తెలీక, డార్క్ అండర్ ఆర్మ్స్‌ను ఎలా వదిలించుకోవాలో అర్థంగాక తీవ్రంగా సతమతం అయిపోతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీని పాటిస్తే గనుక సూపర్ ఫాస్ట్‌గా అండర్ ఆర్మ్స్‌లో ఉన్న డార్క్ నెస్‌ను పోగొట్టుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? మరియు ఏ విధంగా వాడాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక చిన్న సైజు బంగాళ దుంప తీసుకుని నీటిలో శుభ్రంగా కడగాలి.ఇప్పుడు బంగాళ దుంపను మెత్తగా పేస్ట్ చేసి రసాన్ని వేరు చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల కాఫీ పౌడర్, ఒక చిన్న ఈనో ప్యాకిట్ పౌడర్, ఒక స్పూన్ నిమ్మ రసం, నాలుగు స్పూన్ల బంగాళ దుంప రసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు అర నిమ్మ చక్క తీసుకుని తయారు చేసుకున్న మిశ్రమంలో ముంచి అండర్ ఆర్మ్స్‌లో బాగా రుద్దాలి.నాలుగు నుంచి ఆరు నిమిషాల పాటు ఇలా చేసిన తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా అండర్ ఆర్మ్స్‌ను క్లీన్ చేసుకోవాలి.ఆపై మాయిశ్చరైజర్‌ను అప్లై చేసుకోవాలి.
ఇలా రోజుకు ఒక సారి చేస్తే డార్క్ నెస్ క్రమంగా పోయి అండర్ ఆర్మ్స్ తెల్లగా, మృదువుగా మరియు అందంగా మారతాయి.