పెళ్లి కేవలం ఇద్దరి మనుషులను మాత్రమే కాదు.రెండు కుటుంబాలను కూడా లైఫ్ లాంగ్ ఒకటిగా ఉంచుతుంది.
అంత సత్తా భారతీయ వివాహ వ్యవస్థలో ఉంటుంది.ఇక మన భారత దేశంలో పెళ్లి అంటే రకరకాల ఆచారాలు, సంప్రదాయాలతో పాటు సందడి కూడా అదే రేంజ్ లో ఉంటుంది.
పెళ్లి అనగానే బంధువులతో, స్నేహితులతో ఇల్లంతా కళకళ లాడుతూ ఉంటుంది.
పెళ్లి అనగానే ఐదు రోజులు ముందు నుండే సందడి నెలకొంటుంది.
సంగీత్ అని, మెహందీ ఫంక్షన్ అని మంగళ స్నానం అని ఇలా చాలా వేడుకలు పెళ్ళికి ముందు ఉంటాయి.సంగీత్ అనగానే ఎంతో ఉత్సాహం ఉంటుంది అందరికి.
సంగీత్ లో నూతన వధూవరులతో పాటు ఫ్యామిలీ కూడా పాల్గొని చిన్న పెద్ద అనే తేడా లేకుండా డాన్సులు చేస్తూ ఆడుతూ పడుతూ గడిపేస్తారు.
తాజాగా ఒక పెళ్ళి సందర్భంగా జరిగిన సంగీత్ వేడుకలో వధువు చేసిన డాన్స్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ మధ్య పెళ్లి అనగానే కొత్త కొత్త పద్ధతుల్లో డాన్స్ లు చేస్తూ నూతన వధూవరులు అదర కొడుతున్నారు.
తాజాగా అలంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియోలో పెళ్లి కూతురు చేసిన డాన్స్ కు నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.
వధువు హాలీవుడ్ పాటకు భాంగ్రా స్టైల్ లో స్టెప్పులు వేసి అదర గొట్టింది.
ఈ డాన్స్ లో నూతన వధువుతో పాటు మరి కొంతమంది కూడా స్టెప్పులు వేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.ఈ వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.
‘భాంగ్రా ఎంఫైర్’ నుండి వధువు వస్తుందని తెలిపారు.భాంగ్రా ఎంఫైర్ ఎంఈడీ ఒక డ్యాన్స్ టీమ్.
కాలిఫోర్నియాలో దీనిని 2006 లో స్టార్ట్ చేసారు.ఈ బృందం లోని ఒకరే వధువు రాణి ఆర్పవల్లి.
ఈ వీడియో నెటిజెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.