బిగ్ బాస్ కంటెస్టెంట్ హిమజ వరుసగా సినిమా ఆఫర్లను సొంతం చేసుకోవడంతో పాటు బుల్లితెర ఈవెంట్ల ద్వారా , యూట్యూబ్ వీడియోల ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు.అయితే సినిమాల ద్వారా సంపాదించుకున్న డబ్బుతో హిమజ ప్రస్తుతం తన డ్రీమ్ హౌస్ ను నిర్మించుకుంటున్నారు.
గతంలో అపార్టుమెంట్ ను కొనుగోలు చేసిన హిమజ డ్రీమ్ హౌస్ కలను నెరవేర్చుకోవడంతో పాటు డ్రీమ్ హౌస్ విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.
చిన్నప్పటి నుంచి ఇంటి విషయంలో కల ఉందని ఆ కలకు అనుగుణంగా ఈ ఇంటిని నిర్మించుకుంటున్నానని హిమజ తెలిపారు.
కార్ పార్కింగ్ ప్లేస్ ను చూపించిన హిమజ టేకుతో ఉండే మెయిన్ డోర్ ను పెట్టిస్తున్నానని అన్నారు.లెఫ్ట్ సైడ్ లో మోడ్రన్ లిఫ్ట్ పెట్టిస్తున్నామని హిమజ వెల్లడించారు.
ఓపెన్ కిచెన్ ఉండేలా ప్లాన్ చేశామని మెట్లకు పక్కనే పూజ గది ఉంటుందని హిమజ తెలిపారు.
గ్రౌండ్ ఫ్లోర్ లో పేరెంట్స్ ఉంటారని ఫస్ట్ ఫ్లోర్ లో నేను ఉంటానని హిమజ అన్నారు.
తనకు ప్రత్యేకంగా మేకప్ రూమ్, జిమ్ ఉండేలా ప్లాన్ చేశామని హిమజ అన్నారు.ప్రస్తుతం థర్డ్ ఫ్లోర్ స్లాబ్ వర్క్ జరుగుతోందని హిమజ తెలిపారు.
ఈ ఇంటి కోసం బ్యాంక్ లోన్ తీసుకుంటున్నానని హిమజ వెల్లడించారు.మరో ఏడు నెలలలో ఇంటి పనులు పూర్తవుతాయని హిమజ తెలిపారు.
ఇల్లు పూర్తైన తర్వాత వీడియో తీసి చూపిస్తానని హిమజ చెప్పుకొచ్చారు.
ఇంద్ర భవనాన్ని తలపించే విధంగా ఇల్లు ఉండేలా హిమజ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.హిమజ తక్కువ సమయంలోనే లగ్జరీ విల్లాను నిర్మించుకునే స్థాయికి ఎదగడంను చూసి నెటిజన్లు ఆమెను తెగ మెచ్చుకుంటున్నారు.హిమజ ఇంటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ప్రేక్షకుల్లో హిమజకు భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.