బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ డిసెంబర్ 27వ తేదీ తన 56 వ పుట్టిన రోజును ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ప్రతి ఏడాది సల్మాన్ ఖాన్ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం కోసం పన్వేల్‌లోని ఫామ్‌హౌస్ కి వెళ్తారు.
అలాగే ఈ ఏడాది కూడా ఆ హౌస్ కి వెళ్ళిన సమయంలో సల్మాన్ ఖాన్ పాము కాటుకు గురయ్యారు.అయితే ఆయనకు ఏ విధమైన ప్రమాదం లేకపోవడంతో అతని పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.
ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ పలువురు సన్నిహితులు స్నేహితుల సమక్షంలో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.
ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా సెలబ్రిటీ కపుల్ జెనీలియా డిసౌజా, రితేష్ దేశ్‌ముఖ్ కూడా హాజరయ్యారు.
ఇలా కేవలం సన్నిహితులు మధ్య జరిగిన ఈ పార్టీలో జెనీలియా ,సల్మాన్ ఖాన్ తో కలిసి చిందులు వేసింది.ప్రస్తుతం ఈ డాన్స్ వీడియోను జెనీలియా సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.
ఈ వీడియోలో వీరిద్దరూ మెరూన్ కలర్ టీ షర్ట్ ధరించి డెనిమ్ జీన్స్ వేసుకుని ఉన్నారు. అంతేకాకుండా.
‘ఎంతో మంచి మనసున్న వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు’.నీకు సంతోషం, ప్రేమ, ఆరోగ్యం దొరకాలని కోరుకుంటున్నాను.
ఈ రోజు బాయ్ జాన్ పుట్టినరోజు అని రాస్తూ ఈ వీడియోలు షేర్ చేశారు.

ఇక ఈ వీడియోలో సల్మాన్ ఖాన్, జెనీలియా ఎంతో సరదాగా నవ్వుతూ ఇద్దరు పోటాపోటీగా డాన్స్ చేశారు.ఇక సల్మాన్ ఖాన్ తన 56వ పుట్టినరోజు వేడుకలలో భాగంగా బాబీ డియోల్, ఇబ్రహిం అలీఖాన్, అర్బాజ్ ఖాన్, సల్లు భాయ్ మాజీ ప్రియురాలు సంగీత బిజ్లానీ వంటి ఎంతో మంది సన్నిహితులు ఈ పుట్టిన రోజు వేడుకలకు హాజరై ఎంతో సంతోషంగా గడిపినట్లు తెలుస్తోంది.ఇక జెనీలియా విషయానికొస్తే ఈమె రితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన సంగతి మనకు తెలిసిందే.
అతి చిన్న వయసులోనే వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన జెనీలియా ఇప్పటివరకు తన పిల్లల సంరక్షణలో ఉంటూ సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఈ క్రమంలోనే జెనీలియా తిరిగి ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది.ఇక సల్మాన్ ఖాన్ విషయానికి వస్తే ఒకవైపు బుల్లితెరపై వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మరొకవైపు పలు సినిమాలతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ తో కలిసి టైగర్ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
అలాగే కేవలం బాలీవుడ్ చిత్రాలలో మాత్రమే కాకుండా టాలీవుడ్ చిత్రాలలో కూడా అతిధి పాత్రలో నటించడానికి సల్మాన్ ఖాన్ సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది.ఇకపోతే సల్మాన్ ఖాన్ రాజమౌళి దర్శకత్వం లో కూడా ఒక సినిమా చేయబోతున్నారని పెద్దఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
అందుకోసమే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.