ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని కుదిపేసిన ఆగష్టులో ఏం జరిగిందో తెలుసా?

సీనియర్ ఎన్టీఆర్ ఏపీలోని కృష్ణా జిల్లాలో ఉన్న నిమ్మకూరు గ్రామంలో జన్మించారు.మేనమామ సూచనల మేరకు తల్లిదండ్రులు ఎన్టీఆర్ కు తారక రాముడు అని పేరు పెట్టారు.ఆ తర్వాత రోజుల్లో ఆ పేరు తారక రామారావుగా మారింది.1942 సంవత్సరంలో సీనియర్ ఎన్టీఆర్ మేనమామ కూతురును వివాహం చేసుకున్నారు.ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు కాగా చిత్రలేఖన పోటీలలో ఆయనకు బహుమతులు వచ్చాయి.

 Interesting Facts About Senior Ntr Political Life, Interesting Facts, Senior N-TeluguStop.com

1947 సంవత్సరంలో పట్టభద్రుడైన ఎన్టీఆర్ కు పల్లెటూరి పిల్ల సినిమాలో మొదట ఛాన్స్ రాగా ఆ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో మన దేశం సినిమా మొదట విడుదలైంది.మూడున్నర దశాబ్దాల పాటు ఎన్నో సంచలన విజయాలతో ఎన్టీఆర్ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.1983 సంవత్సరంలో ప్రజల అండదండలతో సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టడం జరిగింది.

Telugu August, Senior Ntr-Movie

సంవత్సరంపాటు ఎన్టీఆర్ పరిపాలన సవ్యంగానే జరిగింది.1984లో ఎన్టీఆర్ అమెరికాకు బైపాస్ సర్జరీ కోసం వెళ్లారు.ఆ సమయంలో పదవిపై కన్నేసిన నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ సపోర్ట్, గవర్నర్ అండదండలతో ఆగష్టు నెలలో ఎన్టీఆర్ ను సీఎం పదవి నుంచి తొలగించడంతో పాటు ఆ స్థానంలో భాస్కరరావు కూర్చున్నారు.అమెరికాలో ఉన్న సీనియర్ ఎన్టీఆర్ ఈ వార్త తెలిసిన వెంటనే ఇండియాకు వచ్చేశారు.

Telugu August, Senior Ntr-Movie

బైపాస్ సర్జరీ జరిగి 30 రోజులు కాకముందే ఎన్టీఆర్ ఇండియాకు తిరిగి రావడం గమనార్హం.గాయాలు మానకముందే సీనియర్ ఎన్టీఆర్ న్యాయ పోరాటం మొదలుపెట్టి ఇతర పార్టీల మద్దతు పొందారు.ప్రజల మద్దతు కూడా సీనియర్ ఎన్టీఆర్ కు లభించడంతో ఎన్టీఆర్ మళ్లీ సీఎం అయ్యారు.దాదాపుగా 7 సంవత్సరాల పాటు ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా పని చేశారు.

అధికారంలో ఉన్న సమయంలో ఎన్టీఆర్ ఎన్నో కొత్త స్కీమ్స్ ను ప్రవేశపెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube