ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో వుంచినప్పటికీ.నిబంధనలను అతిక్రమించి పనిమనిషిని నియమించుకున్నందుకు గాను సింగపూర్‌లో భారత సంతతికి చెందిన జంట జైలు పాలైంది.
సయ్యద్ మొహమ్మద్ పీరన్ సయ్యద్ అమీర్ హంజా. తన బిజినెస్ పార్ట్‌నర్ గుర్తింపును ఉపయోగించి ఇండోనేషియాకు చెందిన వ్యక్తిని పనిమనిషిగా నియమించుకున్నాడు.ఇందుకు గాను కోర్టు 8 నెలల జైలు శిక్ష విధించింది.41 ఏళ్ల నిందితుడు నిబంధనలను అతిక్రమించడం, వర్క్ వీసా పొందేందుకు తప్పుడు సమాచారం ఇవ్వడం వంటి అభియోగాలపై తన నేరాన్ని అంగీకరించాడు.
అతని భార్య సబా పర్వీన్ (37) సైతం అదే విధంగా నిబంధనలను ఉల్లంఘించిన నేరాన్ని అంగీకరించడంతో మూడు రోజులు జైలు శిక్ష విధించింది కోర్టు .అయితే ఇండోనేషియాకు చెందిన బాధితురాలు అమీనా.తనపై దంపతులిద్దరూ అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆరోపించింది. టుడే వార్తాపత్రిక కథనం ప్రకారం.అమీనాకు వేతనం చెల్లించడంలోనూ వారు విఫలమయ్యారనే అభియోగాన్ని సైతం కోర్టు పరిగణనలోనికి తీసుకుంది.
జిల్లా జడ్జి జెన్నిఫర్ మేరీ తీర్పు సందర్భంగా మాట్లాడుతూ.
అమీనాకు కనీసం విశ్రాంతి ఇవ్వకపోగా, ఆమెను స్వేచ్ఛగా బతకనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.తీర్పు పత్రాన్ని చదువుతుండగా ఈ జంట కంటతడి పెట్టింది.
సబా వెంటనే తన జైలుశిక్షను అనుభవించడానికి రెడీ అవ్వగా.తన ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి, మరికొన్ని పనులను పూర్తి చేసుకునేందుకు గాను సయ్యద్‌కి కోర్టు వెసులుబాటు కలిపించింది.
దీంతో ఆయన జనవరి 7న జైలులో లొంగిపోనున్నారు.
2014లో సబా తమ పనిమనిషిని గాయపరిచినందుకు మరో మూడు కౌంట్ల అభియోగాలను కూడా ఎదుర్కొంటున్నారు.ఈ కారణాల చేత సయ్యద్ కుటుంబం విదేశీ కార్మికుడిని నియమించుకోకుండా ప్రభుత్వం జూన్ 30, 2019 వరకు బ్లాక్ లిస్ట్‌లో వుంచింది.అయితే సయ్యద్ తమపై ఈ నిషేధాన్ని ఎత్తివేయాల్సిందిగా మానవ వనరుల శాఖకు లేఖ రాశాడు.
కానీ అప్పటికే 2018 ప్రారంభంలో ఇండోనేషియాకు చెందిన అమీనాను పనిమనిషిగా నియమించుకున్నాడు.
ఇందుకుగాను జూలై నెలలో అమీనాను పనిమనిషిగా నియమించుకోవడానికి దరఖాస్తు చేసుకోమని తన సహచరుడు సురేశ్ మురుగైయన్‌ను ఒప్పించి నిషేధాన్ని తప్పించుకున్నాడు.
దీంతో ప్రభుత్వానికి చెందిన ఎంవోఎం వర్క్ పాస్ సిస్టమ్ సురేష్ దరఖాస్తును ఆమోదించింది.సయ్యద్ లేదా అతని కుటుంబ సభ్యులు ఈ వ్యవస్థను ఉపయోగించినట్లయితే.దరఖాస్తు తిరస్కరణకు గురయ్యేది.అందువల్ల ప్లాన్ ప్రకారం సయ్యద్ ఇలా చేశాడని దర్యాప్తు అధికారులు తేల్చారు.
ఈ క్రమంలోనే జూలై 17, 2018న అమీనా సింగపూర్‌కు చేరుకుని సయ్యద్ ఇంట్లో పనిచేయడం ప్రారంభించింది.