బుల్లితెరపై ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమానికి ఎంతో మంచి ప్రేక్షకాదరణ ఉందని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి ఎంతో మంది సినీ సెలబ్రిటీలు హాజరవుతూ వారి కెరియర్ లో జరిగిన ఎన్నో విషయాల గురించి అభిమానులతో ముచ్చటించారు.
తాజాగా ఈ కార్యక్రమానికి సీనియర్ నటి లక్ష్మి కుమార్తె ఐశ్వర్య వచ్చారు.ఐశ్వర్య ఆలీతో ఎంతో సరదాగా తన కెరియర్ లో జరిగిన ఎన్నో విషయాల గురించి ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఆమె తన జీవితంలో ప్రతి ఒక్క డైరెక్టర్ ను తన గురువుగా భావిస్తానని కానీ ఒకే ఒక్క డైరెక్టర్ అంటే తనకు అస్సలు పడదని తెలిపారు.ఇక ఆ డైరెక్టర్ తో ఎంతో మంచిగా ఉన్నప్పటికీ తను మాత్రం తన గురించి ఎంతో తప్పుగా మాట్లాడుతారని తన ఎదురుగా మంచిగా మాట్లాడిన తన వెనుక ఎంతో అవమానిస్తారు అని ఆమె తెలిపారు.
తన జీవితంలో ఏదైనా తప్పు చేశానా అంటే అది ఆ డైరెక్టర్ ని కొట్టకుండా వదిలేయడమేనని నటి ఐశ్వర్య తెలిపారు.
ఇక తను ఒక సినిమా షూటింగ్ సమయంలో పాల్గొన్నప్పుడు షూటింగ్ బ్రేక్ లో వెళ్లి పెళ్లి చేసుకున్నానని, అయితే ఎంత తొందరగా పెళ్లి చేసుకున్నానో అంత తొందరగా విడాకులు కూడా తీసుకున్నానని ఈ సందర్భంగా ఈమె తెలిపారు.ఇకపోతే తల్లి గారితో ఎందుకు దూరంగా ఉన్నారు అని అని ప్రశ్నించగా ఆ ప్రశ్నకు ఐశ్వర్య కన్నీళ్లు పెట్టుకున్నారు.మరి ఈమె జీవితంలో కొట్టకుండా వదిలేసిన ఆ డైరెక్టర్ ఎవరు తన తల్లితో దూరంగా ఉండడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలు తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.
ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.