అందరి ముందు లుంగీ కట్టి లుంగీ డ్యాన్స్ వేసిన సన్నీ లియోన్.. వైరల్ గా వీడియో!

షారుక్ ఖాన్,దీపికా పదుకొనే కలిసి నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలోని లుంగీ డాన్స్ పాట ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అప్పట్లో చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల నోటివెంట లుంగీ డాన్స్… లుంగీ డాన్స్ అనే పాట వినపడేది.

 Sunny Leone Dancing In Front Of Everyone Video Goes Viral, Sunny Leone, Bollywoo-TeluguStop.com

అలాగే ఏ పార్టీలో చూసినా ఏ ఫంక్షన్ లో చూసిన ప్రతి ఒక్కరు ఈ పాటకు అద్భుతమైన స్టెప్పులు వేసేవారు.ఆ విధంగా లుంగీ డాన్స్ పాట ఎంతో ఫేమస్ అయింది.

ఇకపోతే తాజాగా బాలీవుడ్ పోర్న్ స్టార్ సన్నీలియోన్ లుంగీ కట్టి అద్భుతమైన స్టెప్పులతో లుంగీ డాన్స్ ఇరగదీసింది.ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఆమె డాన్స్ కు ఫిదా అయిపోయారు.

సన్నీలియోన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో పోర్న్ స్టార్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ తెలుగులో కూడా పలు చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా దక్కించుకున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ  ‘‘ ఓ మై ఘోస్ట్ ’’ అనే చిత్రం ద్వారా కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ లో భాగంగా లుంగీ డాన్స్ పాటకు డాన్స్ వేసి అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సన్నీలియోన్ పలు చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి గుర్తింపు పొందారు ఈ క్రమంలోనే ఈ బ్యూటీ గతంలో ‘‘ కరణ్ జీత్ కౌర్ : ది అన్ టోల్డ్ స్టోరీ ’’ అనే వెబ్‌సిరీస్‌లో నటించింది.అయితే ఈ సిరీస్ తన జీవిత కథ ఆధారంగా తెరకెక్కడంతో రియల్ పాత్రలో నటించింది.ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ జీ 5 లో అందుబాటులో ఉంది.

ఇక ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న సన్నీ లియోన్ గత కొద్ది రోజుల క్రితం ముంబైలో ఒక ఫ్లాట్ కొనుగోలు చేసి అక్కడే నివాసం ఉంటున్న విషయం తెలిసిందే.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను తన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఎంతో మంది ఈమె డాన్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube