ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు.ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు.
ఎన్నడూ లేని విధంగా రాయలసీమ ప్రాంతంలో కురిసిన వర్షాలకు చాలా మంది నిరాశ్రయులయ్యారు.ఇటువంటి తరుణంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకి లెటర్ రాయడం జరిగింది.
వరదలలో ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.ప్రభుత్వ అంచనా ప్రకారం ఆరు వేల కోట్లకు పైగా నష్టం జరిగితే ఇప్పటికి కేవలం 35 కోట్లు మాత్రమే.
విడుదల చేయటంలో ఏమైనా న్యాయం ఉందా అని ప్రశ్నించారు.
ఇదే సమయంలో ప్రకృతి వైపరీత్యాల నిధులు ప్రభుత్వం వల్లించినట్లు కాగ్ తప్పు పట్టింది అని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా రాయలసీమలోని నాలుగు జిల్లాలను ఆదుకోవాలని, ఏపీలో వరదల వల్ల ప్రాణ మరియు ఆస్తి నష్టంతో పాటు రైతులు భారీగా నష్టపోయారని స్పష్టం చేశారు.వరదల వల్ల నిరాశ్రయులైన వారికి సహాయం చేయాలని.
నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ప్రభుత్వం అండగా ఉండాలని రైతులకు పంట నష్టపరిహారాన్ని పెంచాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.