ఏపీలో ఇంకా ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా అన్ని పార్టీలు ఎన్నికల జపం చేస్తున్నాయి.దీంతో ముందస్తు ఎన్నికలు వస్తాయా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే అధికార పార్టీ వైసీపీకి సెల్ఫ్ గోల్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు.ఎందుకంటే వైసీపీ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి.
వెనుక గొయ్యి అనేలా కనిపిస్తోంది.ముఖ్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి వాస్తవ పరిస్థితి ఎలా ఉందో అర్ధమైంది.
దీని నుంచి ప్రజలను మళ్లించడానికి మంత్రుల పేరుతో బస్సు యాత్రను చేపట్టినా అది కూడా తుస్‌మంది.ఎక్కడా జనాలు వైసీపీ మంత్రులను చూసేందుకు ముందుకు అడుగువేయలేదు.దీంతో బస్సు యాత్రతో వైసీపీ మంత్రులు చేపట్టిన బహిరంగ సభలన్నీ జనం లేక వెలవెలబోయాయి.ఈ పరిస్థితిని వైసీపీ వ్యతిరేక మీడియా విస్తృతంగా ప్రచారం చేయడంతో వైసీపీ నోట్లో పచ్చి వెలక్కాయ పడింది.
మరోవైపు తాము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 95 శాతం హామీలను నెరవేర్చామని.దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా 95 శాతం హామీలను మూడేళ్లలో పూర్తి చేయలేదని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు.
దీంతో వచ్చే ఎన్నికల్లో 151 కాదు 175 సీట్లనూ తామే గెలుస్తామని ప్రకటన చేస్తున్నారు.కానీ వాస్తవ పరిస్థితిని గమనిస్తే ఏపీలో అభివృద్ధి లేదనే విషయం అందరికీ అర్ధమవుతోంది.
ఇంతవరకు ఏపీకి రాజధాని లేదు.అటు కంపెనీల ఊసే లేదు.
పోలవరం పూర్తి కాలేదు.

పోలవరం ప్రాజెక్టుపై ఇటీవల మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలను గమనిస్తే వైసీపీ ఎంతటి డిఫెన్స్‌లో ఉందో ఇట్టే చెప్పవచ్చు.పోలవరం డెడ్లైన్లు అన్నీ పూర్తికావడంతో పోలవరం ఇప్పట్లో పూర్తికాదని.ఇదంతా టీడీపీ వల్లేనంటూ కొత్త పల్లవిని ఆయన అందుకున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే రెండేళ్లలో ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని పలువురు భావిస్తున్నారు.రానున్న కాలంలో ఏపీలో అభివృద్ధి జరిగితే వైసీపీ విషయంలో ప్రజల మైండ్ సెట్ మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.