కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కాగా ఆ సినిమాలలో అసెంబ్లీ రౌడీ ఒకటనే సంగతి తెలిసిందే.బి.
గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.దివ్య భారతి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా కె.వి.మహదేవన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.కెరీర్ లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని మోహన్ బాబు నటుడిగా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.
కెరీర్ తొలినాళ్లలో హీరో రోల్స్ లో నటిస్తూనే మరోవైపు విలన్ రోల్స్ లో కూడా మోహన్ బాబు నటించడం గమనార్హం.
సొంత బ్యానర్ పై తీసే సినిమాల్లో మోహన్ బాబు హీరోగా నటించారు.కేటుగాడు సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన మోహన్ బాబు ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు.
ఆ తర్వాత మోహన్ బాబు హీరోగా నటించిన పలు సినిమాలు ఫ్లాప్ కాగా అల్లుడుగారు సినిమాతో మోహన్ బాబు మరో సక్సెస్ ను సాధించారు.
ఈ సినిమా మోహన్ బాబును నిర్మాతగా నిలబెట్టింది.
ఆ తర్వాత మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
దివ్యభారతికి ఈ సినిమా రెండో తెలుగు సినిమా కావడం గమనార్హం.తమిళంలో హిట్టైన ఒక సినిమా ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో 48 రోజులలో ఈ సినిమా షూటింగ్ పూర్తైంది.
ఈ సినిమాలో శివాజీ అనే పాత్రలో మోహన్ బాబు నటించారు.
ఈ సినిమాలోని అరిస్తే చరుస్తా డైలాగ్ బాగా పాపులర్ అయింది.ఈ సినిమాలోని అందమైన వెన్నెలలోన పాట సూపర్ హిట్ అయింది.1991 సంవత్సరం జులై 3వ తేదీన ఈ సినిమా రిలీజైంది.ఈ సినిమా టైటిల్ గురించి ఏపీ శాసనసభలో దుమారం చెలరేగింది.మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ సినిమాను కొన్ని ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేయగా ఈ సినిమా టికెట్లు పలు ప్రాంతాల్లో బ్లాక్ లో అమ్ముడయ్యాయి.