వైయస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.సమాజంలో అనేక వర్గాలను.
పైకి తీసుకు వచ్చే రీతిలో ఆలోచనలు చేస్తూ విద్యార్థులకు మహిళలకు కొన్ని.కొన్ని సామాజిక వర్గాలకు.
చేయూతనిస్తూ కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.ఈ క్రమంలో రాష్ట్రంలో పేద బ్రాహ్మణుల కుటుంబాల కోసం… జగన్ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అమలు చేయాలని డిసైడ్ అయింది.
విషయంలోకి వెళితే రాష్ట్రంలో పేద బ్రాహ్మణుల అంత్యక్రియలకు పది వేల ఆర్థిక సహాయాన్ని అందించాలని.నిర్ణయం తీసుకోవడం జరిగింది.
గరుడ సహాయ పథకం అనే పేరుతో ఈ సాయాన్ని పేద బ్రాహ్మణులకు అందించాలని జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇదిలా ఉంటే ఏడాది ఆదాయం 75 వేల లోపు ఉన్న వారికి మాత్రమే ఈ సాయం అందించాలని షరతు విధించడం జరిగింది.
అంత మాత్రమే కాక ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వాళ్ళు… 40 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని.తెలియజేస్తూ.https://andhrabrahmin.ap.gov.in ఈ వెబ్ సైట్ అడ్రస్ లో… దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.