డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌

డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలలో భాగంగా అధునాతన వసతులతో కూడిన 500 ఎయిర్‌ కండిషన్డ్‌ వాహనాలను నేడు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద జెండా ఊపి ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌ నెలలు నిండి కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరే అక్కచెల్లెమ్మలను, వారి ఇంటి నుండి 108 వాహనంలో తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్చి నాణ్యమైన వైద్యసేవలు, డబ్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా అందించడంతో పాటు ప్రసవానంతరం వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా ద్వారా తల్లికి విశ్రాంతి సమయంలో అవసరాల కోసం రూ.5000 చేతిలో పెట్టి మరీ ఆ తల్లీబిడ్డలను అంతే క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యతను సైతం భుజాన వేసుకుని శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సదుపాయం.

 Ysr Mother Baby Express , Ysr , Mother , Baby , Express , Jagan , 500 Air Con-TeluguStop.com

డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను ప్రవేశపెట్టడంతో పాటు సేవలను విస్తరించిన కారణంగా ఏడాదికి సగటున 4 లక్షల మందికి ఈ మంచి సౌకర్యం అందుబాటులోకి రానుంది.తల్లులకు సహాయం అందించేందుకు వీలుగా కేంద్రీకృత కాల్‌ సెంటర్‌ మరియు ప్రసవానంతర తల్లుల సౌకర్యార్ధం నర్సులు, డ్రైవర్ల సమన్వయం కోసం డా.వైఎస్సార్‌ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం.

గతంలో అరకొరగా ఉండి ఒక్కొక్కసారి అందుబాటులో ఉండి, ఒక్కొక్కసారి అందుబాటులో లేక, ఆ ఉన్నవాటిలో కూడా వసతులు సరిగా లేని దుస్ధితి.

అరుదుగా దొరికే ఆ సాధారణ వాహనంలో కూడా ఒకే ట్రిప్‌లో ఇద్దరు ప్రసవానంతర మహిళలు, నవజాత శిశువులు, వారి సహాయకులు, వారి లగేజ్‌తో కలిసి ప్రయాసలకు ఓర్చి ప్రయాణించాల్సిన దుర్భర పరిస్ధితినేడు అత్యాధునిక వసతులతో కూడిన పూర్తి ఎయిర్‌ కండిషన్డ్‌ వాహనంలో ప్రత్యేకంగా అన్ని వసతులతో వారిని బాగా చూసుకుంటూ ఒక తల్లి, బిడ్డ, వారి సహాయకులు ఇద్దరు మాత్రమే సౌకర్యవంతంగా ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్న ప్రభుత్వం.

తల్లుల రక్షణ, భద్రతకు భరోసా కల్పిస్తూ అన్ని వాహనాలు జీపీఎస్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానం.

అక్కచెల్లెమ్మలు వాహనం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఏ వాహనం ఎక్కడ ఉందో రియల్‌ టైంలో తెలుసుకునే అవకాశండా.వైఎస్సార్‌ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవల కోసం టోల్‌ఫ్రీ నెంబర్‌ 102డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలలో భాగంగా సీఎం శ్రీ వైయస్.

జగన్ ప్రారంభించనున్న అధునాతన వసతులతో కూడిన 500 ఎయిర్‌ కండిషన్డ్‌ వాహనాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube