దేశవిదేశాలలో బాక్సాఫీస్ వద్ద అత్యధిక రికార్డులు సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా పై సినీ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలోనే ఈ సినిమాపై వివాదాస్పద సంచలన నాయకుడు కె ఏ పాల్ స్పందించారు.
రాజకీయ నాయకుల పై స్పందిస్తూ పలు వివాదాలకు కారణం అయ్యే కే ఏ పాల్ తాజాగా లైవ్ చాట్ లో పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే ఎంతోమంది నెటిజన్లు ఆయనకు వివిధ రకాల ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.
ఏప్రిల్ 9వ తేదీ మీటింగ్ ఉండటంతో త్వరలోనే ఇండియాకి వస్తున్నానని పాల్ చెప్పారు.ఈ క్రమంలోనే కొంతమంది అభిమానులు మీరు ఆర్ఆర్ఆర్ సినిమా చూశారా? అని ప్రశ్నించారు.అదేం సినిమా రోజుకో సినిమా వస్తుంటుంది, పోతుంటుంది అంటూ సమాధానం చెప్పారు.అయితే మరొక నెటిజన్ తాను ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తున్నానని చెప్పడంతో పాల్ మరింత రెచ్చిపోయాడు.
ఆర్ఆర్ఆర్ సినిమాను ఉద్దేశిస్తూ ఎవరో వస్తారు సినిమా తీస్తారు.పోతారు.మనం ఆ సినిమాని చూస్తూ టైం వేస్ట్ చేస్తాము.సినిమా చూడటం వల్ల టైం వేస్ట్ తప్ప లాభం ఏమిటి? అంటూ కామెంట్ చేశారు.ఇక ఈ వీడియోని స్క్రీన్ షాట్ తీసిన రాంగోపాల్ వర్మ రంగంలోకి దిగి తనకు దిమ్మతిరిగే కౌంటర్ వేశారు.ఇక ఈ ఫోటోని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ నీ మొహం రా అంటూ పాల్ పై కౌంటర్ వేశారు.
ప్రస్తుతం వర్మ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే వర్మ రాజమౌళి సినిమాపై ప్రశంసలు కురిపించిన సంగతి మనకు తెలిసిందే.