కాంట్రాక్ట్ పోస్టులు భర్తీ విషయంలో కేసీఆర్ కు చురకలు అంటించిన షర్మిల...

ప్రస్తుతం తెలంగాణలో అప్పుడప్పుడు అధికార పార్టీ పై మాటల చురకలు అంటిస్తూ తాను కూడా రాజకీయాల్లో ఉన్నానని గుర్తు చేస్తున్న వైఎస్ రాజశేఖర్ కూతురు వైఎస్ షర్మిల ప్రభుత్వ విధి విధానాల పై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం తాను ప్రభుత్వం లోని లోపాలను ప్రజల ముందుకు తీసుకువచ్చి తన వాయిస్ ద్వారా బలాన్ని పెంచుకోవాలని చూస్తున్నారట.

 Ys Sharmila Slammed Kcr On Contract Posts, Telanagana, Cm Kcr, Ys Sharmila, Cont-TeluguStop.com

ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతి పదికనే పోస్టులు భర్తీ చేయాలని ఆదేశాలిచ్చిన కేసీఆర్ పై మరోసారి కౌంటర్ వేశారు వైఎస్ షర్మిల.

కాగా కరోనా వ్యాప్తి సమయంలో కాంట్రాక్టుపై వైద్య సిబ్బందిని నియమించాలని నిర్ణయించుకున్న ఈ ప్రభుత్వం తమ పదవులను కూడా కాంట్రాక్టు విధానంలో ముఖ్యంగా సీయం పదవి కూడా కాంట్రాక్టుగా మారిస్తే బాగుంటుందని ఎద్దేవా చేసారు.

రాష్ట్రంలో వైద్య సిబ్బంది నియామకం విషయంలో మీన వేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం ఇదివరకే తగినంత స్టాఫ్‌ను రిక్రూట్ చేసుకుని ఉంటే నేడు వైద్య సిబ్బంది కొరత ఇంతలా ఉండేది కాదు కదా అంటూ ప్రశ్నించారు.ఇకపోతే 2017 లో 3311 స్టాఫ్ నర్సులకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పటి వరకు ఆ ఉద్యోగాలను భర్తీ చేయలేదు దీన్ని బట్టే తెలుస్తుంది.

ఈ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పై ఎంత శ్రద్ద ఉందో అంటూ విమర్శించారు షర్మిల.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube