టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో శ్రీనువైట్ల కూడా ఒకరనే విషయం తెలిసిందే.శ్రీనువైట్ల డైరెక్షన్ లో సినిమా రిలీజవుతుందంటే ఆ సినిమాలో ప్రేక్షకులకు నచ్చే కామెడీ ఖచ్చితంగా ఉంటుందని అభిమానులు భావిస్తారు.
కామెడీ వల్లే శ్రీను వైట్ల సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయని కూడా చెప్పవచ్చు.కామెడీ పైన పట్టు ఎక్కువగా ఉండటం వల్లే శ్రీనువైట్ల కామెడీ కథలను తెరకెక్కిస్తారని చాలామంది భావిస్తారు.
అయితే శ్రీనువైట్ల మాత్రం కెరీర్ తొలినాళ్లలో ఎక్కువగా యాక్షన్ స్టోరీలతో పాటు లవ్ స్టోరీలను సైతం తెరకెక్కించారు.శ్రీనువైట్లకు దర్శకుడిగా తొలి సినిమా నీకోసం అనే సంగతి తెలిసిందే.
లవ్ అండ్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన నీకోసం సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.అయితే టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జునకు మాత్రం నీకోసం సినిమా చాలా బాగా నచ్చింది.
![Telugu Nagarjuna, Nee Kosam, Raviteja, Sreenu Vaitla, Secret, Tollywood-Movie Telugu Nagarjuna, Nee Kosam, Raviteja, Sreenu Vaitla, Secret, Tollywood-Movie]( https://telugustop.com/wp-content/uploads/2021/09/nagarjuna-intresting-facts-tollywood-nee-kosam.jpg)
సినిమా చూసిన తర్వాత నాగార్జున శ్రీనువైట్లతో మాట్లాడుతూ సినిమా బాగుందని అయితే సినిమాలో కామెడీ కూడా ఉంటే ఇంకా బాగుండేదని చెప్పారు.కామెడీ ఉంటే సినిమాలు బాగుంటాయని నాగార్జున చెప్పిన సూచనలు విన్న శ్రీనువైట్ల రెండో సినిమా ఆనందంతో సక్సెస్ ను అందుకున్నారు.ఆ సినిమా సక్సెస్ సాధించడంతో ఆ తర్వాత సినిమాల్లో కామెడీ ఉండేలా శ్రీనువైట్ల జాగ్రత్తలు తీసుకున్నారు.
![Telugu Nagarjuna, Nee Kosam, Raviteja, Sreenu Vaitla, Secret, Tollywood-Movie Telugu Nagarjuna, Nee Kosam, Raviteja, Sreenu Vaitla, Secret, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2021/09/star-director-nagarjuna-intresting-facts-tollywood-nee-kosam.jpg )
ఈ సంఘటన జరిగిన కొన్నేళ్ల తర్వాత నాగార్జున, శ్రీనువైట్ల కాంబినేషన్ లో కింగ్ అనే సినిమా తెరకెక్కింది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న శ్రీనువైట్ల సరైన కథతో సక్సెస్ సాధించాలని భావిస్తున్నారు.
ఒక విధంగా శ్రీనువైట్ల స్టార్ డైరెక్టర్ కావడానికి నాగార్జున కారణమయ్యారు.ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ఢీ అండ్ ఢీ సినిమా తెరకెక్కుతోంది.