బిగ్ బాస్ సీజన్ –5 అంగరంగ వైభవంగా మొదలైంది.నాగార్జున హోస్టుగా చేసిన ఈ షో కలర్ ఫుల్ గా జనాలకు కనువిందు చేసింది.
తొలి రోజు పార్టిసిపెంట్ల ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ జిగేలున మెరిసింది.మొత్తం 19 మంది కంటెస్టెంట్లు షోలోకి అడుగు పెట్టారు.
ఐదు సీజన్లలో ఒక దానికి ఎన్టీఆర్ హోస్టుగా చేయగా.మరొకదానికి నాని చేశాడు.
మిగతా రెండు సీజన్లకు నాగార్జున చేశాడు.తాజా షోకు సైతం నాగ్ హోస్ట్ గా ఉన్నాడు.
మొత్తంగా 3, 4, 5 సీజన్లను ఆయన సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నాడు.గత షోలతో పోల్చితే ఈ సీజన్ లో మరింత జోష్ పెంచాలని ప్రయత్నిస్తున్న నాగార్జున.
తాజా సీజన్ పై సోషల్ మీడియాలో రకరకాల విమర్శలు వస్తున్నాయి.నాగార్జున పైనా జనాలు వ్యతిరేకత కనబరుస్తున్నారు.తాజా సీజన్ తొలి ఎపిసోడ్ నుంచే జనాల్లో అనాసక్తి మొదలైనట్లు తెలుస్తోంది.నాగార్జున మాటలు అంతగా ఆకట్టుకోవడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
![Telugu Emk, Bigg Boss, Biggboss, Fans, Fil, Nagarjuna, Tarak, Telugu Biggboss, T Telugu Emk, Bigg Boss, Biggboss, Fans, Fil, Nagarjuna, Tarak, Telugu Biggboss, T](https://telugustop.com/wp-content/uploads/2021/09/bigg-boss-5-host-nagarjuna-ntr-tarak-emk-fans-disappointed-vijay-devarakonda-filnews-tollywood-telugu-biggboss.jpg )
నాగార్జున ప్లేస్ లో మరో హీరో అయితే బాగుంటుందనే టాక్ నడుస్తుంది. నాగార్జున వద్దు ఎన్టీఆర్ కావాలనే ఓ ప్రచారానికి కూడా తెర లేచింది.మరికొందరు విజయ్ దేవరకొండ అయితే ఇంకా బావుంటుంది అనే మాటలు వ్యక్తం అవుతున్నాయి.అటు నాగార్జున హోస్టింగ్ బోర్ కోడుతుందా? అంటూ అభిప్రాయ సేకరణ సైత మొదలు పెట్టారు.
![Telugu Emk, Bigg Boss, Biggboss, Fans, Fil, Nagarjuna, Tarak, Telugu Biggboss, T Telugu Emk, Bigg Boss, Biggboss, Fans, Fil, Nagarjuna, Tarak, Telugu Biggboss, T]( https://telugustop.com/wp-content/uploads/2021/09/ntr-tarak-emk-fans-disappointed-vijay-devarakonda-filnews-tollywood-telugu-biggboss.jpg)
జనాలు చాలా కాలంగా బిగ్ బాస్ షో గురించి ఎదురు చూస్తున్నారు.తొలి ఎపిసోడ్ ఎంతో ఆకట్టుకుంటుంది.అని చాలా మంది భావించారు.అనుకున్నట్లుగానే ఆదివారం సాయంత్రం జనాలు టీవీలకు అతుక్కుపోయారు.
కానీ జనాల నుంచి ఈ షోకు అంతగా పాజిటివ్ టాక్ రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.ఎన్టీఆర్ హోస్టుగా ఉండాలని చాలా మంది కోరుతున్నా ఆయన హోస్టుగా చేస్తున్న జెమినీ టీవీ మీలో ఎవరు కోటేశ్వరుడు అనే షో పట్ల జనాలు అంతగా ఆసక్తి చూపడం లేదు.
టీఆర్పీ రేటింగ్ సైతం అంతగా లేదు.దీంతో షోలో కంటెంట్ ఉండాలి తప్ప హోస్టులను బట్టి తీరు మారదు అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.