మ్యాచో మ్యాన్ గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సీటిమార్.ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డీ లేడీస్ టీమ్ కోచ్ గా నటిస్తున్నాడు.తమన్నా కబడ్డీ టీమ్ కోచ్ జ్వాలా రెడ్డిగా నటిస్తుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచేసాయి.
ఇక తాజాగా విడుదల అయినా ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.ఈ ట్రైలర్ కు భారీ స్పందన రావడంతో చిత్ర యూనిట్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా త్వరలోనే విడుదల అవ్వబోతున్న నేపథ్యంలో మరిన్ని ప్రమోషన్స్ చేస్తూ జనాల్లోకి తీసుకు వెళ్లాలని చిత్ర యూనిట్ బాగానే కష్టపడుతుంది.ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి మరొక అప్డేట్ రాబోతుందని మేకర్స్ తెలిపారు.
మరొక ఎక్సైటింగ్ అప్డేట్ తో త్వరలోనే రాబోతున్నామని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసారు.
అంత ఎక్సైటింగ్ అప్డేట్ ఏమయ్యి ఉంటుందా అని అందరు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు.అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఈ అప్డేట్ అయి ఉంటుందని లేదంటే ఈ ఈవెంట్ కు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిధిగా రాబోతున్నాడని ఆ విషయంపై అయి ఉంటుందని అనుకుంటున్నారు.
ఏ విషయం తెలియాలంటే మరి కొద్దీ సమయం వేచి ఉండాల్సిందే.ఇక ఈ సినిమా ఎమోషన్ తో పాటు థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది.భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
భూమిక కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మరి వరుస ప్లాప్స్ తో బాధపడుతున్న గోపీచంద్ కు సీటిమార్ సినిమా అన్న హిట్ అవుతుందో లేదో చూడాలి.