సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా షాలిని పాండే హీరోయిన్ గా తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్న చిత్రం అర్జున్ రెడ్డిఅప్పట్లో ఈ సినిమా అంతగా యూత్ ను ఆకట్టుకుంది.అప్పటివరకు సినిమాలకి ఉన్నటువంటి హద్దులను కూడా ఈ సినిమా చెరిపేసిందని చెప్పవచ్చు.
ఇందులో హీరో హీరోయిన్ గా నటించిన వీరికి ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయని చెప్పవచ్చు.
ఈ సినిమా విడుదలై నేటికి నాలుగు సంవత్సరాలు కావడంతో ఈ సందర్భంలోనే అర్జున్ రెడ్డి హీరోయిన్షాలిని పాండే స్పందిస్తూ.
పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జున్ రెడ్డికి తాను ఎంతో రుణపడి ఉన్నానని తెలియజేశారు.
ఈ సినిమాలో నా స్థాయికి మించి నటించాను ఈ క్రమంలోనే ప్రేక్షకులు నా కష్టాన్ని గుర్తించి నా నటనకు పై ప్రశంసలు కురిపించారని ఈ సినిమాలో ఓ నటిగా నా వ్యక్తిగత లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఎంతో ఉపయోగపడిందని తెలియజేశారు.అర్జున్ రెడ్డి సినిమా తన జీవితంలో ఎప్పుడు స్పెషల్ అని ఈ బ్యూటీ తెలిపారు.
![Telugu Arjun Reddy, Bollywood, Ranveer Singh, Shalini Pandey, Tollywood-Movie Telugu Arjun Reddy, Bollywood, Ranveer Singh, Shalini Pandey, Tollywood-Movie]( https://telugustop.com/wp-content/uploads/2021/08/arjun-reddy-tollywood-vijay-devarakonda-bollywood.jpg)
ప్రస్తుతం ఈ బ్యూటీ రణ్ వీర్ సింగ్ తో జయేశ్ భాయ్ జోర్దార్సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా ద్వారా షాలిని బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.ఇక ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో తన పాత్ర గురించి ప్రస్తుతం తానేమీ మాట్లాడలేనని, నా పాత్రకు సంబంధించి అప్ డేట్ రావాలంటే మరికొంత సమయం పడుతుందని అప్పటివరకు వేచి ఉండాల్సిందేనని తెలియజేశారు.ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ పాన్ ఇండియా చిత్రాల్లో నటించే అవకాశాలను సంపాదించుకున్నారని చెప్పవచ్చు.