ఆర్ఎక్స్ 100 చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటుడు కార్తికేయ.ఈ సినిమా ద్వారా వెండితెర ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు.
ఈ సినిమాలో గ్లామరస్, బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ తోకలిసి రొమాన్స్ చేసిన ఈ హీరో తన మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఈ విధంగా మొదటి సినిమా మంచి విజయం సాధించడంతో ఈ హీరోకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు అవకాశాలు వచ్చాయి.
అయితే ఆ తరువాత నటించిన చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేక పోయాయి.
గత కొద్ది రోజుల క్రిందట విడుదలైన చావు కబురు చల్లగా సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేకపోయింది.
వృత్తిపరమైన జీవితం ఇలా ఉండగ వ్యక్తిగత విషయానికి వస్తే ఈ నటుడు త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ యువహీరో గుట్టుచప్పుడు కాకుండా, కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నట్లు తెలుస్తోంది.
హీరో కార్తికేయ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోనున్నారు.
ఈ యువ హీరో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు? ఏమిటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. నిన్న నిశ్చితార్థం జరుపుకున్న ఈ హీరో త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి, తన పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించనునట్లు తెలుస్తోంది.ఇక సినిమాల విషయానికి వస్తే కార్తికేయ ప్రస్తుతం రాజా విక్రమార్క సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదే కాకుండా కార్తికేయ UV క్రియేషన్స్ తో కలిసి ఆశక్తికరమైన ప్రాజెక్టులో నటించబోతున్నట్లు సమాచారం.మరి ఈ యువ హీరో నిశ్చితార్థం, పెళ్లి గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ఈ హీరో ఆ విషయాలను అధికారికంగా ప్రకటించే వరకు వేచి ఉండాలి.