బుల్లితెర ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎంతలా సక్సెస్ అందుకుంటుందో చూస్తూనే ఉన్నాం.సామాన్యులే కాకుండా సెలబ్రెటీలు కూడా ఈ సీరియల్ కు బాగా అలవాటు పడ్డారు.
పైగా ట్విస్టుల మీద ట్విస్ట్ లు ఉండటంతో కథ మొత్తం బాగా ఆసక్తిగా మారింది.ఈ వారం జరుగుతున్న ఎపిసోడ్ లను చూస్తే కథ మొత్తం చివరి దశలో ఉన్నట్లు తెలుస్తుంది.
మొత్తానికి 25న పెళ్లి జరగాలని అనుకున్న మోనిత ప్లాన్ మొత్తం నాశనం అయ్యింది.కానీ అన్ని నిజాలు తెలుసుకున్న కార్తీక్ మాత్రం కోపంతో ఊగిపోయి మోనితకు గన్ గురి పెట్టి కాలుస్తాడు.
కానీ కాల్చింది మాత్రం చూపించక పోయేసరికి మళ్లీ ఒక ట్విస్ట్ ఎదురైంది.
అలా కార్తీక్ చంపాడనుకోని రోషిణి వచ్చి మోనిత శవాన్ని కనిపించకుండా చేశాడని చెప్పి అరెస్టు చేసి తీసుకెళ్తుంది.
కానీ ఇన్ని రోజులు అమెరికాలో ఉన్న సౌందర్య ఎంట్రీ ఇచ్చి నేనే చంపాను.నా కొడుకు తప్పు లేదు అంటూ లొంగిపోతుంది.మొత్తానికి కార్తీకదీపం డైరెక్టర్ కథను శుభం కార్డు పట్టించేలా కనిపిస్తున్నాడు.ఇక చివరికి వచ్చిన ఈ కథలో.
ఎటువంటి ట్విస్టులు మళ్ళీ పెట్టకపోతే దీంతో మొత్తానికి కథ ఎండింగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది.
![Telugu Deepa, Babu Monitha, Karthika Deepam, Kathikadeepam, Nirupam, Rohini, Van Telugu Deepa, Babu Monitha, Karthika Deepam, Kathikadeepam, Nirupam, Rohini, Van](https://telugustop.com/wp-content/uploads/2021/08/karthika-deepam-serial-vantalakka-saying-good-bye-with-the-final-twist-in-the-seriall.jpg )
ఇక ప్రేక్షకుల కోరిక కూడా తీరుతున్నట్లు అనిపించగా.మరోవైపు వంటలక్క అభిమానులు కాస్త బాధ పడుతున్నట్లు అనిపిస్తుంది.సీరియల్ శుభం కార్డు పలుకుతుందని.
ఇక వంటలక్క కనిపించదని అనుకుంటున్నారు.ఏడేళ్ల కథను ఒక్క ఏడు ఎపిసోడ్ లలో పూర్తి చేసినట్లు ఆపై కార్తీక్ కుటుంబం పిల్లాపాపలతో సంతోషంగా ఉండేనున్నట్లు తెలుస్తుంది.
![Telugu Deepa, Babu Monitha, Karthika Deepam, Kathikadeepam, Nirupam, Rohini, Van Telugu Deepa, Babu Monitha, Karthika Deepam, Kathikadeepam, Nirupam, Rohini, Van](https://telugustop.com/wp-content/uploads/2021/08/karthika-deepam-serial-vantalakka-saying-good-bye-with-the-final-twist-in-the-serials.jpg )
చూస్తుండగానే మరో నెలలో ఈ సీరియల్ పూర్తవుతుందని.ఇక మన వంటలక్క మనల్ని వదిలేసి గుడ్ బై చెప్పనుందని అర్థమవుతుంది.ఒకవేళ మళ్లీ డైరెక్టర్ ఏదైనా ట్విస్ట్ తగిలిస్తే మాత్రం మళ్లీ కథ మొత్తం రివర్స్ అవుతుంది.చూడాలి ఈవారం ఈ సీరియల్ ఎలా సాగుతుందో.అసలు శుభం కార్డు పలుకుతుందా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తిగా ఉంది.