మనం సాధారణంగా సినిమాలో నటీనటుల చేసే స్టంట్ సన్నివేశాలు ఎప్పుడు చూస్తూనే ఉంటాం.నటీనటుల చేసే స్టంట్ నచ్చి మళ్ళీ మళ్ళీ అవే చూడాలి అని భావిస్తూ ఉంటారు.
అచ్చం అలాగే తాజాగా ఒక కోడి స్టంట్స్ చేయడం మొదలు పెట్టేసింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
ఒక కోడి గుడ్డుతో వీర లెవెల్లో స్టంట్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా గుడ్డును కాలితో గాల్లోకి ఎగిరేసి, రెండో కాలుతో ఆ గుడ్డును ఆపేసి, అదే పనిగా ఎగిరేసింది అంతేకాకుండా తన మెడ భాగంలో గుడ్డును పట్టుకుని అక్కడ కాసేపు గుడ్డు అలానే నిలపెట్టుకుంది.
ఈ క్రమంలో ఆ గుడ్డును రెక్కల మీదకు చేర్చుకుని రెక్కలతో గుడ్డును కొద్ది సేపు గాలిలో ఆడించింది ఇలా కొద్ది నిమిషాల పాటు ఆ కోడి చేసిన అద్భుతమైన విన్యాసాలు వీడియో నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
వీడియో చూసిన నెటిజన్స్ కొంతమంది అనుమానం వచ్చి ఆ వీడియోపై రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు.దీనితో అసలు నిజం బయటికి వచ్చింది.అది ఏమిటంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో చేసిన అద్భుతమైన ఎడిటింగ్ అని తెలుసుకున్నారు.
చివరకు ఇదంతా ఒట్టి గ్రాఫిక్స్ అని తెలుసుకొని నెటిజన్స్ ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు.ఇంకెందుకు ఆలస్యం ఈ కోడి స్టంట్స్ వీడియోను మీరు కూడా చూసేయండి.